బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ప్రధాని నరేంద్రమోదీపై పరోక్షంగా సెటైర్ వేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ట్వింకిల్ ఖన్నా.. సందర్భం వచ్చిన ప్రతీసారి మోదీపై సెటైర్లు వేస్తూనే ఉంటుంది.

ఇటీవల మోదీ యోగా ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కేథార్ నాథ్ యాత్రలో భాగంగా ఒక గుహలో మెడిటేషన్ చేస్తూ మోదీ తీసుకున్న ఫోటోషూట్ పై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. 

కాషాయం రంగులో ఉన్న ఒక బొమ్మ దాని పక్కన ప్యాంట్ లేకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది. ఈ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ''ఇటీవల నేను ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫోటోలను కొన్నింటిని చూశాను. వాటి ప్రేరణతో నేను కూడా మెడిటేషన్ ఫోటోగ్రఫీకి చెందిన వర్క్ షాప్ ను ప్రారంభిస్తున్నాను. ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంటే సూపర్'' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది.

ట్వింకిల్ తన ట్వీట్ లో ఎక్కడా.. మోదీ పేరు ప్రస్తావించనప్పటికీ ఆమె ట్వీట్ అర్ధం చేసుకున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.