యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఓ పాట వైరల్ అవుతోంది. ఆ పాట గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు... అంటూ ఎన్నో రీల్స్ కూడా చేస్తున్నారు. ఇది ఎంత పాత పాటో తెలుసా? 

ఎప్పుడు ఏ పాట ఎవరికీ నచ్చుతుందో.. ఎప్పుడు వైరల్ అవుతుందో.. చెప్పడం కష్టం. ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు’ అంటూ ఒక పాట చాలా వైరల్ అవుతోంది. ఈ పాట మీద రీల్స్ చేసేందుకు ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. అయితే ఆ పాట వివరాలు మాత్రం చాలామందికి తెలియదు. నిజానికి ఇది చాలా పాత పాట. జనరేషన్ జెడ్ యువతకే కాదు... ఎనభైలలో పుట్టిన వారికి కూడా ఈ పాట గురించి తెలియకపోవచ్చు. దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి పాట.. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మీలో ఎంతోమంది రీల్స్ చేసిన ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు’0 అనే పాట అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలోది. ఇది 1975లో విడుదలైంది.

ఈ పాటను ఒక సింగర్ తన ఫ్రెండ్ తో కలిసి పాడాడు. ఇప్పుడు అది వైరల్ అయింది. అతడి పాటను వినాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి.

అదిరిపోయే పాటలు

అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నందమూరి తారక రామారావు, మురళి మోహన్, నందమూరి బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మరొక హిట్ సాంగ్ కూడా ఉంది. అదే ‘ఆనాటి హృదయాల ఆనంద గీతం’ అనే పాట. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని పాటలను తెలుగు సంగీత ప్రపంచం మరిచిపోలేదు. అందులో మరొక శ్రావ్యమైన పాట ‘గులాబీ పువ్వై నవ్వాలి వయసు’ అనే పాట.

ఈ పాటలోని చరణాలే

గులాబీ పువ్వై నవ్వాలి వయసు... అనే పాటను సుశీల, బాలసుబ్రమణ్యం అప్పట్లో ఆలపించారు. ఇప్పుడు ఇదే పాట యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది. ఈ పాటలోని చరణం ‘మరీ మరీ నీ అందానికి సలాము చేశాను...’ అని మొదలవుతుంది. ఆ చరణంలోనే ఒకచోట ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు.. అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను’ అని వస్తుంది. లేటెస్ట్ గా ఈ చరణం ట్రెండింగ్ గా మారింది. దీనిపై ఎన్నో రీల్స్ చేస్తున్నారు జనరేషన్ జెడ్. అన్నీ కూడా లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంటున్నాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్లి చూస్తే చాలు... ఈ పాటతో ఎన్నో రీల్స్ కనిపిస్తాయి.‘ మరీ మరీ నీ అందానికీ’ అని టైప్ చేసినా.. ‘యుగాలకైనా నా దానివై’ అని టైప్ చేసిన వేల కొద్ది రీల్స్ వచ్చి పడుతున్నాయి. అంతగా ఈ పాట నవతరానికి నచ్చేసింది.

మీకు పాత పాట వెర్షన్ వినాలని ఉంటే ఇక్కడ మేము యూట్యూబ్ లింక్ ని ఇచ్చాము. దీంట్లో మీరు పాట వీడియోను చూడవచ్చు. అలాగే కొత్త పాటను కూడా మరొక వీడియోలో చూడవచ్చు.

YouTube video player