Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ షోకి వెళితే ఊరుకోను... భార్య దెబ్బకు బంపర్ ఆఫర్ వదులుకున్న హీరో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. అయితే ఓ సీరియల్ హీరోని భార్య అడ్డుకుందట. చేసేది లేక బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నాడట.. 
 

serial hero indraneel decides not to contest in bigg boss telugu season 8 ksr
Author
First Published Aug 22, 2024, 1:03 PM IST | Last Updated Aug 22, 2024, 1:03 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ వేరు. ఈ షో మొదలైందంటే మిగతా షోలు, సీరియల్స్ రేటింగ్స్ ఢమాల్. టాప్ రేటెడ్ షోగా బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ అంతకంతకు తన పాపులారిటీ పెంచుకుంటుంది. ఈ షోకి ఉన్న ఆదరణ నేపథ్యంలో పలువురు కంటెస్ట్ చేయాలని భావిస్తారు. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం సామాన్యులకు అంత సులభం కాదు. సెలబ్రిటీ హోదా ఉంటే మార్గం సుగమం అవుతుంది. గత ఏడు సీజన్స్ లో ముగ్గురు నలుగురు సామాన్యులకు మాత్రమే కంటెస్ట్ చేసే అవకాశం దక్కింది. 

సీజన్ 7 విన్నర్ గా కామనర్ నిలిచాడు. రైతుబిడ్డ ట్యాగ్ తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. బహుశా ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో ఒక కామనర్ టైటిల్ కొట్టడం ఇదే ప్రధమం కావొచ్చు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 మరింత ఆసక్తిగా రూపొందించారట మేకర్స్. రూల్స్, రెగ్యులేషన్స్, టాస్క్స్, గేమ్స్ కఠినంగా ఉండే సూచనలు కలవు. 

ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్స్ కి లిమిట్ లేదని హోస్ట్ నాగార్జున అంటున్నారు. సీజన్ 8 లోగో ఇన్ఫినిటీ ఆకారంలో డిజైన్ చేశారు. ఈ అంశాలు బిగ్ బాస్ షోపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు సెలెబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాగా ఓ 12 మంది సెలెబ్స్ దాదాపు ఖరారు అయ్యారు. వీరు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటారంటూ ప్రచారం జరుగుతుంది. 

యాంకర్ రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క, మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్, ఆలీ తమ్ముడు ఖయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, నటి సోనియా సింగ్, సీరియల్ నటి యాష్మి గౌడ, మోడల్ ఊర్మిళ చౌహన్, నటుడు అభిరామ్ వర్మ, నటుడు నిఖిల్... ఫైనల్ అయ్యారట. కాగా ఈ లిస్ట్ లో ఉన్న ఇంద్రనీల్ చివరి నిమిషంలో తప్పుకున్నాడని సమాచారం. 

serial hero indraneel decides not to contest in bigg boss telugu season 8 ksr

అందుకు కారణం ఆయన భార్య మేఘన అంగీకరించడం లేదట. బిగ్ బాస్ షోకి వెళ్లవద్దని ఇంద్రనీల్ ని ఆమె ఆపేశారట. బిగ్ బాస్ షోకి వెళితే పాజిటివ్ ఇమేజ్ కంటే నెగిటివ్ ఇమేజ్ ఎక్కువగా వస్తుంది. అది కెరీర్ కి మైనస్ అవుతుంది. కాబట్టి మీరు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయవద్దని భర్తతో గట్టిగా చెప్పారట. భార్య మాటను జవదాటలేక ఇంద్రనీల్ షోకి వెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నాడట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరైన స్పై అక్క బయటపెట్టింది. 

కాగా సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్. సాయంత్రం 7 గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. రాత్రి 10 గంటలకు టోటల్ కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోతుంది.. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios