బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘టైగర్3’ Tiger3. ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మంచి వ్యూస్ ను దక్కించుకుంటోంది.
బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ Salman Khan - కత్రినా కైఫ్ Katrina Kair జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘టైగర్3’. గతేడాది నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) లో భాగంగా ‘ఏక్తా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’ వంటి చిత్రాల తర్వాత ప్రముఖ బ్యానర్ నుంచి Tiger3 థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్సాన్స్ కూడా దక్కింది.
బాక్సాఫీస్ వద్ద కూడా ‘టైగర్ 3’ కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.466 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. సినిమాకు మంచి స్పందనే లభించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కత్రినాతో పాటు.. ఇమ్రాన్ హస్మి, రిద్ది డోగ్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్స్ లోనూ కనిపించారు. ఈ చిత్రానికి మనీశ్ శర్మ్ దర్శకత్వం వహించారు.
థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది. జనవరి 7 నుంచి ఈ యాక్షన్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
