OTT Releases : ఈవారం ఓటీటీలోకి విజయ్ ‘లియో’, సిద్ధార్థ్ ‘చిన్నా’.. మరిన్ని చిత్రాలు, సిరీస్ లు

ఈ వారం ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. తమిళ స్టార్ విజయ్ దళపతి ‘లియో’తో పాటు మరిన్ని చిత్రాలు, సిరీస్ లో డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నాయి.
 

Movies and web series coming to OTT this week  NSK

ఓటీటీ చిత్రాలపైనా ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో తెలిసిందే. నేరుగా కంటెంట్ నచ్చితే థియేటరైనా, ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా బ్లాక్ బాస్టర్ చేసేందుకు ఆడియెన్స్ ఎప్పుడూ ముందుంటూనే ఉన్నారు. ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలెన్లో ఉండటం విశేషం. ఇక ఈ వారం కూడా వివిధ భాషల్లో మోస్ట్ అవైటెడ్, ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లో ఓటీటీలోకి రాబోతున్నాయి. అవేంటి? ఏ తేదీన రాబోతున్నాయో తెలుసుకుందాం..

తమిళ స్టార్ విజ్ దళపతి (Vijay Thalapathy)  - లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం Leo The Film. ఈ మూవీ భారా అంచనాలతో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకుల నుంచి కాస్తా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ కాస్ట్ ఉన్న ఈ మూవీ బాక్పాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఈచిత్రం ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. నవంబర్ 16న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. 

హీరో సిద్ధార్థ్ నటించిన ఎమోషనల్ డ్రామా ‘చిన్నా‘ (Chinna) చిత్రం కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ  ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రి కూతురి ప్రేమ గురించిన చెప్పిన ఈ సినిమా థియేటర్లలో పర్లేదనిపించింది. 

అలాగే నంబర్ 15న (ఇవాళ) నుంచి హిందీ ఫిల్మ్ అపూర్వ (Apurva) చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరో హిందీ ఫిల్మ్  సుఖీ (Sukhee) మూవీ నంబర్ 17న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఇక మలయాళం నుంచి ‘కన్నూర్ స్క్వాడ్’ నవంబర్ 17న, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థాయ్ భాషలో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘కంగ్రాట్స్ మై ఎక్స్’ చిత్రం నంబర్ 16న, ప్రైమ్ వీడియోలో రాబోతోంది. 

వెబ్ సిరీస్ ల విషయానికొస్తే..  నవంబర్ 17న ‘ట్విన్ లవ్’ - ప్రైమ్ వీడియోలో..  నవంబర్ 18న ‘ది రైల్వే మెన్’ - నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios