Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu Serial Today:మాస్టర్ ప్లాన్ శైలేంద్రదే.. కానీ, రిషేంద్ర భూషణ్ తిప్పి కొట్టేశాడుగా..!

చిత్ర ఇంటికి వెళ్లే సరికి, ఇంట్లో కూర్చొని ఉంటుంది. వసు వెళ్లగానే, ఇప్పుడు వచ్చారు ఏంటి మేడమ్ అని అడుగుతుంది. అదేంటి చిత్ర.. నువ్వే కదా మెసేజ్ చేశావ్ అని వసు అడుగుతుంది.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram
Author
First Published Nov 27, 2023, 8:53 AM IST

Guppedantha Manasu Serial Today: బెయిల్ వచ్చిన తర్వాత రిషి, వసులు ఇంటికి చేరతారు.  ఇంట్లో కూర్చొని వసుధార ఏడుస్తూ, బాధపడుతూ ఉంటుంది. దీంతో, రిషి ఆమెను ఓదార్చే పనిలో పడతాడు. ‘నువ్వు తప్పు చేశావని, అందరూ నమ్ముతున్నారని అనుకుంటున్నావా వసుధార. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకున్నా, మేము నమ్ముతాం’ అని రిషి భరోసా ఇస్తాడు. మహేంద్ర సైతం నువ్వు ఏ తప్పు చేయలేదని, నీకు మేం అండగా మేమున్నాం అని చెబుతాడు. ఆ తర్వాత రిషి, అసలు ఏం జరిగింది వసుధార అని అడుగుతాడు.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram

‘ నేను ఏ తప్పు చేయలేదు సర్. నేను ఇప్పుడు భయపడుతోంది, బాధపడుతోంది నా మీద నింద వేశారని కాదు. డీబీఎస్టీ కాలేజీ  పరువు పోయిందని, నా వళ్ల మీరు పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టాల్సి వచ్చింది. చిత్ర కూడా ప్రమాదంలో ఉంది. చిత్రకు ఏదైనా అవుతుందని భయంగా ఉంది సర్’ అని వసు ఏడుస్తుంది. ఆ తర్వాత రిషి, చిత్రకు ఏం కాదని ధైర్యం చెబుతాడు. తర్వాత, ‘ఆ వీడియోలో నువ్వు వాళ్లను బెదిరిస్తున్నట్లుగా ఉంది. కానీ నేను అది నమ్మను. ఎందుకంటే, నువ్వు ఏది చేసినా మంచి కోసమే చేస్తావని తెలుసు. అంతకముందు, ఇలాంటివి చూసి నిన్ను నమ్మక నేను ఏం కోల్పోయాను నాకు తెలుసు. నువ్వు తప్పు చేశావు అంటే నేను నమ్మను. అసలు చిత్ర నీకు ఎందుకు మెసేజ్ చేసింది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావ్? అక్కడికి వెళ్లాక ఏం జరిగింది. వాళ్లు ఇప్పుడు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు’ అని రిషి ప్రశ్నలు వేస్తాడు.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram

‘అదే నాకు కూడా అర్థం కావడం లేదు సర్, అసలు చిత్ర  ఎందుకు సూసైడ్ చూసుకుందో తెలియడం లేదు.’అని వసు అంటుంది. అయితే, రిషి అలా కాదు, అక్కడ ఏం జరిగిందో, క్లియర్ గా చెప్పు అంటాడు. అప్పుడు అసలు జరిగిన విషయం బయటపెడుతుంది. తాను ఇంట్లో ఉండగా, చిత్ర ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్తుంది. చిత్ర ఇంటికి వెళ్లే సరికి, ఇంట్లో కూర్చొని ఉంటుంది. వసు వెళ్లగానే, ఇప్పుడు వచ్చారు ఏంటి మేడమ్ అని అడుగుతుంది. అదేంటి చిత్ర.. నువ్వే కదా మెసేజ్ చేశావ్ అని వసు అడుగుతుంది.

తాను మెసేజ్ చేయలేదు అని చిత్ర చెప్పగా, ఆ మెసేజ్ చేసింది తానే అంట చిత్ర బాయ్ ఫ్రెండ్ అక్కడకు వస్తాడు. దీంతో, వసు ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా అని అనగా, ‘తనకు ప్రేమగా ఉందని, చిత్ర పై తనకు ప్రేమగా ఉందని, మీరు ఎలాగైనా మా ప్రేమను బతికించాలని, అందుకు మీరు సహాయం చేయాలనే నేను మీకు మెసేజ్ చేశాను’ అని చెబుతాడు. దీంతో, వసు అతనిపై సీరియస్ అవుతుంది. కాలేజీలో చెంప పగలకొట్టినా బుద్ధి రాలేదా అని తిడుతుంది. అయినా, అతను వినకుండా చిత్ర ప్రేమ నాకు కావాలి అంటాడు. దీంతో, వసు మళ్లీ అతన్ని బుద్ధి లేదా అని తిడుతుంది. నువ్వు తనను ప్రేమిస్తే సరిపోతుందా? తాను ప్రేమించక్కర్లేదా అని వసు ప్రశ్నిస్తుంది.

దానికి ఆ అబ్బాయి, చిత్రకు కూడా తనంటే ప్రేమ అని బయటపడటం లేదు అంటాడు. ఆ మాటలకు చిత్ర వెంటనే అసలు తనకు ఇష్టం లేదు అని చెబుతుంది. మరో వైప ఆ అబ్బాయి చిత్రను మీరే ఒప్పించాలని, ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించారు అని చెబుతాడు. చిత్ర పేరెంట్స్ కూడా బలవంతంగా చిత్రను అతనికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని చెబుతారు. వసు వాళ్లపై కూడా సీరియస్ అవుతుంది. దీంతో, ఆ అబ్బాయి మోకాళ్ల మీద పడి మరీ వసుని బతిమిలాడుతూ ఉంటాడు. చిత్ర పేరెంట్స్ కూడా దండం పెడుతూ ఉంటాడు. చిత్ర మాత్రం అతనిని పెళ్లి చేసుకుంటే తన జీవితం నాశనం అయిపోతుందని చెబుతుంది. వీళ్లు మాత్రం దండాల మీద దండాలు పెడుతూ ఉంటారు. విసిగిపోయిన వసు వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి చిత్రను ఇబ్బంది పెడితే, జైల్లో పెట్టిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇదే వీడియోని మాటలు లేకుండా కేవలం యాక్షన్ చూసి, వసూ వాళ్లను బెదిరించినట్లు అనుకొని అరెస్టు చేయడం గమనార్హం. ఇదే జరిగింది అని వసుధార రిషికి చెబుతుంది. అప్పుడు రిషి, నువ్వు వెళ్లేముందు నాకు చెప్పాలి కదా అంటాడు. అయితే, మీరు అలసిపోయారని అందుకే, చెప్పకుండా వెళ్లానని చెబుతుంది.ఇలా జరుగుతుందని అనుకోలేదని, అందుకే చెప్పకుండా వెళ్లానని  వసు అంటుంది.

దీంతో, రిషి, మహేంద్ర, వసులకు చిత్ర ఆత్మహత్యాతయ్నం ఎందుకు చేసుకుందా అనే అనుమానం వస్తుంది. వాళ్లే బలవంతంగా చిత్రను అలా చేశారా అనే అనుమానం కలుగుతుంది. అసలు వాళ్లు తనను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని వసు అనుకుంటూ ఉంటుంది. అయితే, వాళ్ల చేత ఎవరైనా చేయించి ఉండొచ్చు కదా అని అంటాడు. ఈ సీన్ చూస్తే, రిషికి వెనక బ్యాగ్రౌండ్ లో ఏం జరిగింది అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram

ఇక, ఇదంతా శైలేంద్ర ప్లాన్ అని  తర్వాతి సీన్ లోనే తెలిసిపోతుంది. శైలేంద్ర తన భార్య ధరణి తో కలిసి ట్రిప్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తన తల్లి దేవయణికి ఫోన్ చేసి, ఈ విషయంలో వాళ్లు తనను పట్టుకోలేరు అని ధీమా గా చెబుతాడు. వసుని భలే ఇరికించావ్ అని దేవయాణి సంబరపడిపోతూ ఉంటుంది. ఈ సీన్ ని ఒకవైపు దేవయాణి , శైలేంద్రలు మాట్లాడుకుంటుండగా , మరో వైపు రిషి, వసులు మాట్లాడుకోవడాన్ని చూపించారు. తెలివిగా వసుని ఇరికించారని, రిషి తెలుసుకుంటాడు. తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని, తనను ఎవరూ పట్టుకోలేరని శైలేంద్ర అనగా, ఇది చేసినవారు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా, కలుగులో ఉన్నా పట్టుకుంటానని రిషి అంటాడు. ఆధారాలు లేకుండా అసలు నిన్ను ఎలా పట్టుకుంటారు అని దేవయాణి అనగా, ఆధారాలు లేకున్నా, తానే పోలీసులా మారి ఆధారాలు సేకరిస్తాను అని  రిషి అంటాడు. అయితే, మీరు జాగ్రత్తగా ఉండండి అని రిషితో వసు అంటుంది. అయితే, ఇక్కడ మహేంద్ర హీరోని ఎలివేట్ చేసే కొన్ని డైలాగులు చెబుతాడు.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram

ఇక, తర్వాత నిద్రలో వసుకి మెళకువ వచ్చేసరికి రిషి కనిపించడు. వెంటనే వెళ్లి, ఇల్లంతా వెతుకుతుంది. అయినా కనిపించడు. దీంతో వెళ్లి  మహేంద్రను అడుగుతుంది. రిషి కనిపించడం లేదు అనే విషయాన్ని చెబుతుంది. తన దగ్గరకు కూడా రాలేదని మహేంద్ర చెబుతాడు. కారు కూడా లేదని, బయటకు వెళ్లారేమో అని , ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్లారో అని కంగారుపడుతుంది. ఫోన్ చేస్తే, స్విచ్ఛాఫ్ అని వస్తుంది. దీంతో వసు భయపడుతుంది. అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాడేమో, కంగారుపడవద్దని  మహేంద్ర ధైర్యంచెబుతాడు. మళ్లీ హీరో ఎలివేషన్ డైలాగులు సింహంతో పోలుస్తూ చెబుతాడు. యాక్షన్ మూవీల్లో డైలాగుల్లా ఉంటాయి.

సీన్ కట్ చేస్తే, చిత్రను చంపడానికి రౌడీలు వస్తారు. ఆ రౌడీల్లో ఒకరు చిత్ర బాయ్ ఫ్రెండ్ కావడం విశేషం. వెంటనే, కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటారు. తీరా చూస్తే, అక్కడ చిత్ర ఉండదు. దిండ్లు పెట్టి ఉంటాయి. వెంటనే, రిషి ఎంట్రీ ఇస్తాడు. ఫ్యాన్స్ కి ఈ సీన్ బాగా నచ్చేస్తుంది. రిషి ఎంట్రీ చూసి వాళ్లు షాకైపోతారు. ముందు నుంచి నీ మీద డౌట్ ఉందని, అందుకే, తన జాగ్రత్తలో తాను ఉన్నానని రిషి అంటాడు. తాను చిత్రను సేవ్ చేశానని చూపిస్తాడు. రిషి ని చూసి ఆ రౌడీలు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పారిపోతున్నవారిలో చిత్ర బాయ్ ఫ్రెండ్ ని మాత్రం రిషి పట్టుకోగలుగుతాడు.వాడిని పట్టుకుంటాడు. కానీ, ఎవరికీ చెప్పడు. ఈలోగా చిత్ర కనపడటం లేదని రిషి వాళ్లను  పోలీసులు పిలుస్తారు. వాళ్లలో ఒకరి దగ్గర వీడియో ఆన్ చేసి ఉంటుంది.అదంతా దేవయాణి లైవ్ లో చూస్తూ ఉంటుంది.

Guppedantha Manasu Serial Today 27th November 2023 Rishi To the Rescue ram

చిత్ర పేరెంట్స్ ని రిషి ప్రశ్నిస్తూ ఉంటాడు.  వసు కారణంగానే చిత్ర ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు తమ కూతురిని కిడ్నాప్ చేశారని చిత్ర పేరెంట్స్ సీరియస్ అవుతూ ఉంటారు. ఇదంతా వీడియోలో చూసుకొని తన కొడుకు దెబ్బ కొడితే ఇలా ఉంటుంది అని మరో వైపు దేవయాణి సంబరపడిపోతూ ఉంటుంది. తమ కూతురిని చంపేశారా, ఏం చేశారు అని  చిత్ర పేరెంట్స్ అడుగుతుంటే, రిషి సీరియస్ అవుతాడు. కూతురి గురించి అలా మాట్లాడతారా అని సీరియస్ అవుతాడు. చిత్ర ఉందని, ఎక్కడ ఉందో తానే చూపిస్తాను అని  వాళ్ల ానన్నను పిలుస్తాడు. మహేంద్ర చిత్రను వీల్ చైర్ లో కూర్చొపెట్టి మరీ తీసుకొని వస్తాడు. చిత్ర బతికి ఉండటంతో దేవయాణి కూడా షాకౌతుంది. చిత్ర పేరెంట్స్ ముఖాలు సైతం మాడిపోతాయి. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios