Asianet News TeluguAsianet News Telugu

Brahma mudi Serial Today:దొంగను బురిడి కొట్టించిన కావ్య, అప్పూ కోసం భయపడుతున్న కనకం..!

ఆ తర్వాత కావ్య దొంగను అన్నయ్య అని పిలుస్తుంది. ఇక, ఆ దొంగ కూడా కనెక్ట్ అయిపోయి చెల్లెమ్మ అంటాడు. ఆ సీన్  చాలా కామెడీగా ఉంటుంది. వాళ్లిద్దరినీన చూసి, రాజ్ కి చిరాకు పెడుతుంది.

Brahma mudi Serial Today November 22nd Raj Dissuades Kavya ram
Author
First Published Nov 22, 2023, 10:14 AM IST

Brahma mudi  Serial Today: అప్పూకి ఏదైనా అయిపోతుందేమో అని కనకం భయపడుతూ ఉంటుంది.  అప్పూ ఆత్మహత్య చేసుకున్నట్లు కల కంటుంది. తర్వాత వెంటనే అప్పూ రూమ్ కి వెళ్లి చూస్తుంది. అయితే, గదిలో అప్పూ కనిపించదు. దీంతో, ఎక్కడికి వెళ్లిందా అని వెతుకుతూ ఉంటుంది. తీరా చూస్తే, అప్పూ బావి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కనకం వెళ్లి, అప్పూని పలకరిస్తుంది. నిద్రపట్టడం లేదని అందుకే అలా కూర్చున్నానని చెబుతుంది. లోపలికి రమ్మని కనకం అడిగితే, నాకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా అంటుంది. ఎక్కడ కోపంగా తిడితే, మళ్లీ అప్పూ బాధపడుతుందో అని కనకం ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేసి, ఇంట్లోకి తీసుకువస్తుంది. రూమ్ లోకి తీసుకువచ్చి మరీ పడుకోపెడుతుంది. కనకం కూడా అప్పూ పక్కనే పడుకుంటుంది. కావ్య పక్కన ఉంటే కష్టంగా ఉండదని, అదే నువ్వు పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుందని, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లవు కదా అని అడుగుతుంది. వెంటనే అప్పూ ఏడుస్తూ, కనకంని హత్తుకుంటుంది.

సీన్ కట్ చేస్తే, ఇంట్లో రాజ్, కావ్య నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ల ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తాడు. వాళ్ల రూమ్ తలుపు తీసి ఉండటంతో, వెంటనే దొంగ గదిలోకి ప్రవేశిస్తాడు. కావ్య, రాజ్ నిద్రపోతూ ఉంటారు. వాళ్లు లేస్తే ప్రాబ్లం అవుతుంది అని, దొంగ రాజ్, కావ్యలను ఇద్దరినీ కలిపి కట్టేస్తాడు.  చేతులు, కాళ్లు మొత్తం ఇద్దరినీ కలిపి కట్టేస్తాడు.  వాళ్లిద్దరూ ఆ సమయంలో మంచి నిద్రలో ఉంటారు. నిద్రలో వాళ్లిద్దరూ కదలడానికి ప్రయత్నిస్తుండగా మెళకువ వస్తుంది. చూసుకుంటే, ఇద్దరూ కట్టేసి ఉన్నామని గుర్తిస్తారు. ఎవరు కట్టేసారా అని చూస్తే, దొంగ కనపడతాడు.

Brahma mudi Serial Today November 22nd Raj Dissuades Kavya ram

ఎవరు నువ్వు అంటే, దొంగ అని  చాలా డైలాగులు చెబుతాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి రాజ్ ప్రయత్నిస్తుంటే, కావ్య ఇప్పటి వరకు దొంగను చూడలేదని, చూస్తాను అంటుంది. ఆ తర్వాత దొంగ, దొంగ అని అరుస్తుంది. దీంతో, దొంగ కత్తి తీస్తాడు. దీంతో, వాళ్లిద్దరూ భయపడతారు. ఆ తర్వాత కావ్య దొంగను అన్నయ్య అని పిలుస్తుంది. ఇక, ఆ దొంగ కూడా కనెక్ట్ అయిపోయి చెల్లెమ్మ అంటాడు. ఆ సీన్  చాలా కామెడీగా ఉంటుంది. వాళ్లిద్దరినీన చూసి, రాజ్ కి చిరాకు పెడుతుంది.

ఆ తర్వాత దొంగ గురించి, అతని కుటుంబం గురించి ఆరా తీస్తుంది. అంతేకాకుండా, దొంగకు లేనిపోని ఐడియాలు ఇస్తూ ఉంటుంది. పనిలో పనిగా, దొంగకు రాజ్ ని బావని చేస్తుంది.  ఆ తర్వాత దొంగను దొంగ ఎలా అయ్యావ్ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ దొంగ కూడా ఏదేదో సోది చెప్పేస్తాడు.  ఆ తర్వాత కత్తి పట్టుకొని డబ్బులు ఎక్కడ ఉన్నాయ్..? నగల్ ఎక్కడ ఉన్నాయ్  అని అడుగుతాడు. వీళ్లిద్దరూ బ్యాంకులో ఉన్నాయని చెబుతారు. 

Brahma mudi Serial Today November 22nd Raj Dissuades Kavya ram

తర్వాత రాజ్ క్రెడిట్ కార్డు ఎక్కడ ఉంటుందో కావ్యే చెబుతుంది. దాంట్లో రూ.5వేలు డ్రా చేసుకునేలా కావ్య ఐడియా ఇస్తుంది. చాలా తెలివిగా, ఎక్కువ డబ్బులు తీసుకోకుండా, రూ.5వేలు మాత్రమే తీసుకునేలా చేస్తుంది. ఆ తర్వాత దొంగ కి కుశల ప్రశ్నలు అడుగుతుంది.  ఆ తర్వాత కట్లు విప్పకుండానే దొంగ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దొంగకి డబ్బులు, నగల గురించి చెప్పలేదని, అది తన తెలివి అంటూ తనని తానే పొగుడుకుంటుంది.  తర్వాత రాజ్ గుండెలపై తల పెట్టుకొని పడుకుంటుంది. రాజ్ కూడా చేసేది ఏమీ లేక, అలానే పడుకుంటాడు.

మరో వైపు స్వప్న, డబ్బులు ఎలా తేవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా నగలు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెడదాం అనుకుంటుంది. ఇంట్లోవాళ్లు నగలు ఏవీ అని అడిగితే, రాహుల్ దొంగతనం చేశాడు అని చెబుదాం అనుకుంటుంది. అది కాస్త రాహుల్ వినేస్తాడు. ఇక, కమింగప్ లో బయట నుంచి వస్తున్న స్వప్నను రాహుల్ ఆపుతాడు. స్వప్న ఎవరితోనే సంబంధం పెట్టుకుందని ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. స్వప్న ఫ్రెండ్ మాత్రమేనని చెప్పినా, ఇంట్లో వారు నమ్మరు. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios