Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi serial Today:అప్పూ ఆనందం కోసం అనామికను వద్దు అనుకున్న కళ్యాణ్, కనకం మరో ప్లాన్..!

ఎందుకంటే తాను ఏ విషయంలోనూ బాధపడటం లేదని చెబుతుంది. అయితే, కళ్యాణ్ మాత్రం నేను నీ నుంచే మొండితనం నేర్చుకున్నానని, నువ్వు సమాధానం చెప్పేవరకు తాను ఇక్కడి నుంచి కదలని చెప్పి తేల్చేస్తాడు. అప్పూ కోసం కళ్యాణ్ అలా ఉండటం  చూసి కనకం చాలా సంతోషిస్తుంది. 

Brahma Mudi serial Today:29th November 2023 Kanakam on a Mission ram
Author
First Published Nov 29, 2023, 10:41 AM IST


Brahma Mudi serial Today:అనామికతో కలిసి షాపింగ్ వెళ్లడానికి వచ్చిన కళ్యాణ్.. అప్పూని కూడా తీసుకొని వెళ్లాలని అనుకుంటాడు. అందుకే, అనామికను కారులో కూర్చోపెట్టి అప్పూ కోసం వస్తాడు. కానీ, అప్పూ బాధగా ఉండటం చూసి ఆమెను ఓదారుస్తూ ఉంటాడు. కారులో చాలా సేపు ఎదురుచూసి చిరాకు వచ్చిన అనామిక వెంటనే అక్కడికి వచ్చేస్తుంది. అంత సేపు ఎదురుచూయించాడనే కోపంలో ఉన్న ఆమెకు కళ్యాణ్ , అప్పూతో మాట్లాడుతూ కనిపించే సరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది, దీంతో అక్కడే సీరియస్ అవుతుంది.  తనను రోడ్డు మీద వదిలేసి వచ్చి, ఇక్కడ ఫ్రెండ్ తో ముచ్చట్ల పెడుతున్నావా అని అడుగుతుంది.‘ నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? కారులో వెయిట్ చేస్తూ కూర్చోవడానికి. ఇప్పటి వరకు అందరూ నా కోసం ఎదురుచూసిన వాళ్లే ఉన్నారు. నేను ఎవరి కోసం ఎదురు చూడలేదు. నువ్వు నన్ను ఈ రోజు కారులో గంట సేపు కూర్చోపెట్టావ్’ అని సీరియస్ గా చెబుతుంది. పాపం అమాయకపు కళ్యాణ్ కి అనామికకు విపరీతమైన కోపం వస్తుందనే విషయం కూడా అర్థం కాదు. అప్పూ బాధపడుతోందని, అదే విషయం చెబుతూ ఉంటాడు. తనని మనతో తీసుకువెళ్లడానికి కన్విన్స్ చేస్తున్నా అంటాడు. ఈలోగా అనామిక ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా అని సీరియస్ గా అడుగుతుంది. కాసేపు వెయిట్ చెయ్యమని అడిగి, మళ్లీ అప్పూని కళ్యాణ్ బతిమిలాడుతూ ఉంటాడు. అప్పూ కూడా, అనామిక ఎదురు చూస్తోందని, నా కోసం ఎదురుచూడొద్దని, వెళ్లిపోమ్మని చెబుతుంది. నాకు వేరే పని ఉందని వెళ్లిపోమ్మని అప్పూ అంటుంది. దాంతో  కళ్యాణ్ అసలు నీకు నాతో రావడం ఇష్టం లేదు కదా అని కళ్యాణ్ అడగగా, అసలు నాకు నీతో రావడం ఇష్టం లేదు అని అనామిక సీరియస్ అవుతుంది. అది పట్టించుకోకుండా కళ్యాణ్ అప్పూని బతిమిలాడుతూ ఉంటాడు. ఇక, అనామికకు మండిపోతుంది. నువ్వు నీ ఫ్రెండ్ తోనే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అనామిక వెళ్తుంటే ఆపుతున్నట్లుగా చేసిన కనకం, వెళ్లినందుకు మాత్రం సంతోషిస్తుంది.  తర్వాత కళ్యాణ్ తో మాట్లాడటం మొదలుపెడుతుంది.‘అప్పూతో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అనామికతో వెళ్లాల్సింది. పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ని బాధపెట్టావ్’ అంటుంది. ‘ అనామికకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవచ్చు. ప్రాబ్లం అంతా బ్రోతోనే. అస్సలు మాట వినదు. బాధపడుతుంటే నేను చూడలేను. ఏం చేయాలో చెప్పండి.  ఈరోజు అప్పూ నవ్వే వరకు ఇక్కడి నుంచి వెళ్లను’ అంటాడు. దానికి అప్పూ.. నువ్వు ఎంత సేపు ఉన్నా, నువ్వు కోరుకున్న సమాధానం దొరకదు అంటుంది. ఎందుకంటే తాను ఏ విషయంలోనూ బాధపడటం లేదని చెబుతుంది. అయితే, కళ్యాణ్ మాత్రం నేను నీ నుంచే మొండితనం నేర్చుకున్నానని, నువ్వు సమాధానం చెప్పేవరకు తాను ఇక్కడి నుంచి కదలని చెప్పి తేల్చేస్తాడు. అప్పూ కోసం కళ్యాణ్ అలా ఉండటం  చూసి కనకం చాలా సంతోషిస్తుంది. 

మరోవైపు రాజ్ ఆఫీసుకు రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే కావ్య రాజ్ దగ్గరకు వస్తుంది. తనతో కలిసి బయటకు రమ్మని అడుగుతుంది. ఈ విషయంలోనూ ఎప్పటిలాగానే ఇద్దరూ కీచులాడుకుంటారు. స్వప్నను బ్లాక్ మెయిల్ చేసిన అరుణ్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందని, అక్కడికి వెళ్లి వాడిని రెండు పీకితే అసలు నిజం తెలుస్తుందని , తన అక్క తప్పు చేయలేదని తెలిస్తే, ఇంట్లో వాళ్లు అందరూ సంతోషిస్తారని చెబుతుంది. దానికి రాజ్ నువ్వు వెళ్లు, నేను రాను అంటాడు.  ఇలాంటి పనులు చేయడానికి నాకు అవసరం లేదు అంటాడు. అయితే.. కావ్య ఇప్పుడు నేను బయటకు వెళ్తాను అంటే అందరూ ఎక్కడికి  అని అడుగుతారని, అరుణ్ కోసం అని చెబితే మళ్లీ, ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది అంటుంది. అదే మీరు నన్ను తీసుకువెళితే, ఎవరూ ఏ ప్రశ్నలు అడగరని, తాతయ్య కూడా మనం అన్యోన్యంగా ఉన్నామని సంతోషిస్తారని చెబుతుంది. అయినా కూడా రాజ్ కరగడు. తనకు అవసరమైనప్పుడే తాను నటిస్తానని, నువ్వు చెబితే కాదు అని చెబుతాడు. అయితే, మీరు వచ్చేలా చేస్తాను అని కావ్య శపథం చేస్తుంది.

ఏమీ తెలియనట్లు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని, అందరూ చూసే సమయంలో బయటకు వెళ్లడానికి బయలు దేరుతుంది.  ధాన్యలక్ష్మి చూసి ఏంటి విశేషం అని అడుగుతుంది. దానికి కావ్య సిగ్గుపడుతూ రాజ్ చెప్పొద్దు అన్నాడు అని, సర్ ప్రైజ్ అని చెబుతుంది.  కాసేపు ఇంట్లో డ్రామా జరుగుతుంది. ఆ సమయానికి రాజ్ కిందకు వస్తాడు. కావ్యను స్పెషల్ గా రెడీ చేసి ఎక్కడికి తీసుకువెళుతున్నావ్ అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. కావ్య డ్రామాలో రాజ్  ఇరుక్కుపోతాడు. తప్పక రాజ్ కావ్యను తీసుకువెళతాను అంటాడు. రాజ్ అంగీకరించిన తర్వాత కావ్య మళ్లీ ఇంకో డ్రామా మొదలుపెడుతుంది. అత్తయ్య గారు ఒప్పుకుంటేనే వస్తాను అంటుంది. ఇంత డ్రామా చేస్తుందని ముందే తెలిస్తే, పైనే ఒప్పుకనేవాడిని కదా అనుకుంటాడు. అసలే కోపంగా ఉన్న అపర్ణను ఈ విషయం అడగటానికి రాజ్ పడుతున్న ఇబ్బంది చూస్తే, ఎవరికైనా నవ్వు వస్తుంది. 

అడగలేక, అడగలేక అడుగుతాడు. అపర్ణ కూడా సీరియస్ గా వెటకారంగా తీసుకువెళ్లు అంటుంది. అయినా కూడా కావ్య, అత్తయ్య సంతోషంగా చెబితేనే వస్తాను అంటుంది. తర్వాత అపర్ణ నవ్వుతూ వెళ్లమంటుంది. అత్తయ్యగారు సంతోషంగా వెళ్లమన్నారు అని చెప్పి వెళదాం అంటుంది. ఆ తర్వాత కూడా సిగ్గుపడుతూ కొన్ని డైలాగులు చెబుతుంది. అది చూసి రాజ్..దీని నటనకు నేను కూడా పడిపోయేలా ఉన్నాను అని అనుకుంటాడు. తర్వాత కావ్య చెయ్యి పట్టుకొని లేటు అవుతుందని లాక్కొని వెళతాడు. అది చూసి రుద్రాణికి మండిపోతుంది. కావ్య చాలా బాగా రాజ్ ని మేనేజ్ చేస్తోంది అని అంటుంది.కావ్యను ఒక్కమాట అన్నా ఆ ఇంట్లో ధాన్యలక్ష్మి ఒప్పుకోదు. అందుకే, వెంటనే రుద్రాణి మీద సెటైర్లు వేస్తుంది.


మరోవైపు ఇంట్లో అప్పూ భోజనం చేస్తూ ఉంటుంది. కనకం దాక్కొని మరీ చూస్తూ ఉంటుంది.  పొద్దున నుంచి ఆకలిగా లేదని తినను అని చెప్పిన అప్పూ, కళ్యాణ్ తినమనగానే తింటోంది అని కనకం అంటుంది. తన అక్కతో కలిసి కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కంటే, అప్పూకి ప్రాధాన్యత ఇచ్చాడని, ఫ్రెండ్ అయితే కాసేపు ఉండి వెళతారని, కానీ అప్పూ బాధంతా పోయేంత వరకు ఇక్కడే ఉండి, ఆ తర్వాతే వెళ్లాడని కనకం అంటుంది. కళ్యాణ్ కూడా అప్పూని ప్రేమిస్తున్నాడని తనకు సందేహంగా ఉందని అంటుంది. కళ్యాణ్ దూరమైనప్పుడే అప్పూకి తన ప్రేమ తెలిసిందని, అలాగే  అప్పూకి పెళ్లి ఫిక్స్ చేసుంటే కళ్యాణ్ కి కూడా ప్రేమ అర్థమయ్యేదని అంటుంది. కళ్యాణ్ కళ్లల్లో అప్పూ మీద ప్రేమ చూశానని , అప్పూ బాధపడుతుంటే తను కూడా బాధపడ్డాడు. ఈ విషయం కళ్యాణ్ కి అర్థమయ్యేలా చేయాలని అనుకుంటుంది.  కళ్యాణ్ కూడా తన ప్రేమ గురించి  తెలిస్తే, అప్పుడు అతను కూడా అనామికను వదిలేసి, అప్పూ దగ్గరకు వచ్చేస్తాడని, దాని కోసం తాను దుగ్గిరాల ఇంటికి వెళ్లాలని, అక్కడ కళ్యాణ్ తో ఉంటూ అతని మనసులో ఉన్నది అప్పూ అనే విషయం అర్థమయ్యేలా చేయాలని ఫిక్స్ అవుతుంది.

తనకు ఆ ఇంటికి వెళ్లడానికి ఒక్క అవకాశం వస్తే చాలని, ఆ అవకాశం రాగానే తాను అప్పూతో  కళ్యాణ్ కి పెళ్లి చేస్తానని అంటుంది. ఆ అవకాశం  స్వప్న రూపంలో వస్తుంది. స్వప్న తాను కడుపుతో ఉన్న విషయం చెప్పడానికి కనకానికి ఫోన్ చేస్తుంది. ఈ సారి నిజంగానే తాను తల్లికాబోతున్నానని చెబుతుంది. ముందు కనకం నమ్మదు. నాటకం అనుకుంటుంది. కానీ, ఈ సారి నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యానని చెబుతుంది. కావాలంటే కావ్యకు ఫోన్ చేసి అడుగు అంటుంది.

మరోవైపు రాజ్ కావ్యను కారులో తీసుకొని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో కావ్య  రాజ్ పై ఫన్నీ సెటైర్లు వేస్తూ ఉంటుంది. తిక్క మాటలతో రాజ్ ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి అరుణ్ ఉన్న హాస్పిటల్ వైపు వెళతారు. మధ్యలో వాళ్ల కన్వర్జేషన్  చాలా ఫన్నీగా ఉంటుంది.  ఈ లోగా కావ్యకు వాళ్ల అమ్మ కనకం ఫోన్ చేస్తుంది. కనకం మాటలు విని, రాజ్ కూడా నవ్వుకుంటాడు. నిజంగా స్వప్న తల్లికాబోతోందా లేక మళ్లీ నాటకం ఆడుతుందా అని అడగుతుంది. అయితే, కావ్య నిజం అని చెబుతుంది. కమింగ్ అప్ లో రాహుల్ అరుణ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో రాజ్ , కావ్య వచ్చినట్లు చూపిస్తారు. మరి నిజంగా అరుణ్ ని పట్టుకుంటారో లేదో చూడాలి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios