Asianet News TeluguAsianet News Telugu

Brahma Mudi Serial Today:రాహుల్ ని గెంటేసిన స్వప్న, కావ్యలోనూ మొదలైన అనుమానం..!

సపోర్ట్ చేయడానికి కూడా ఒక హద్దులు ఉండాలి అని రాజ్ అంటే, నిజానిజాలు తెలియకుండా నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి అంటుంది. కానీ, రాజ్ మాత్రం నిజంగా మీ అక్క అరుణ్ తో కలిసి మాట్లాడటం నేను చూశాను అని చెబుతాడు.

Brahma Mudi Serial Today 27th November 2023 Kavya Cobfronts Raj ram
Author
First Published Nov 27, 2023, 10:31 AM IST

Brahma Mudi  Serial Today: చాలా కాలం వరకు కడుపు నాటకం ఆడిన స్వప్న ఈ సారి నిజంగానే తల్లైంది. అయితే, ఆ కడుపుతో తనకు సంబంధం లేదని, స్వప్నకు అక్రమ సంబంధం అంటగట్టాలని రాహుల్ ప్రయత్నిస్తాడు. అయితే, ఇంట్లో పెద్దవారందరూ కలిసి, ఈ విషయంలో నిజా, నిజాలు తేలేవరకు  ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని స్వప్నకు సపోర్ట్ గా నిలుస్తారు. దీంతో, రాహుల్, రుద్రాణిలు డీఎన్ఏ రిపోర్టు మార్చైనా సరే, స్వప్నను వదిలించుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఈ పంచాయతీ అంతా అయిపోయిన తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోతారు. అప్పుడే అక్కడ జరిగిన దాని గురించి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే కావ్య గదిలోకి ఎంట్రీ ఇస్తుంది.

రాజ్ చాలా కోపంగా ఉంటాడు. ‘ఛీఛీ.. రానురాను ఇంట్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరికి నచ్చినట్లు వారు బతికేస్తున్నారు’ అని రాజ్ అంటాడు. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని కావ్య ప్రశ్నిస్తుంది. ఇంకెవరి గురించి మీ అక్క గురించే అని రాజ్ అంటాడు. మా అక్క తప్పు చేసిందని రాహుల్ లాగే మీరు కూడా నమ్ముతున్నారా అని అడుగుతుంది. తప్పు చేయలేదు అనడానికి నోరు తప్ప ఒక్క సాక్ష్యం అయినా ఉందా అని రాజ్ ప్రశ్నించగా, శీలానికి సాక్ష్యం కావాలా? అని కావ్య అడుగుతుంది. ఆడదాని పవిత్రతకు సాక్ష్యం కావాలా? అంటుంది. అయితే, రాజ్ ఆ మాట చెప్పి విచ్చలివిడిగా బతకొచ్చా అంటాడు. దానికి కావ్య కాస్త సీరియస్ గానే అది అందరికీ విడిగా బతికింది కానీ, విచ్చలవిడిగా కాదు అని బదులిస్తుంది. అక్క తప్పుకి చెల్లి సపోర్టా? సపోర్ట్ చేయడానికి కూడా ఒక హద్దులు ఉండాలి అని రాజ్ అంటే, నిజానిజాలు తెలియకుండా నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి అంటుంది. కానీ, రాజ్ మాత్రం నిజంగా మీ అక్క అరుణ్ తో కలిసి మాట్లాడటం నేను చూశాను అని చెబుతాడు.

Brahma Mudi Serial Today 27th November 2023 Kavya Cobfronts Raj ram

ఫ్రెండ్ తో మాట్లాడటం కూడా తప్పేనా అని కావ్య ప్రశ్నించగా, నగలు తాకట్టుపెట్టి డబ్బులు ఎందుకు ఇచ్చిందని మరో ప్రశ్న వేస్తాడు. ఏ పరిస్థితుల్లో అలా ఇచ్చిందో అందరిముందు చెప్పింది కదా అని స్వప్న అంటుంది. అయినా, రాజ్ వినిపించుకోడు. స్వప్న కడుపు విషయంలో నువ్వు కూడా నిజాలు దాచావు అంటాడు. రాహుల్, రుద్రాణిలాగా నీచంగా మాట్లాడొద్దని, మీ గురించి నేను ఉన్నతంగా ఆలోచిస్తున్నానని, దిగజారొద్దు అంటుంది.  కానీ రాజ్ మాత్రం, నువ్వు ఏమనుకున్నా నాకు పర్వాలేదు ఐడోంట్ కేర్ అంటాడు. ఆ మాటకు కావ్యకు బాగా కాలుతుంది. ఇలా వ్యక్తిత్వం దిగార్జుకొని బతుకుతాను అంటూ ఊరుకోను అని కౌంటర్ ఇస్తుంది. ఇద్దరూ కాసేపు ఇదే విషయంపై వాదించుకుంటూ ఉంటారు. తమ వంశం కూడా గొప్పదేనని కావ్య బదులిస్తుంది. తన అక్క గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. కానీ, రాజ్ మాత్రం తనతో పెళ్లికి ఒప్పుకొని తర్వాత రాహుల్ తో వెళ్లిపోయిందని గుర్తు చేస్తాడు. రాహుల్ వేసిన కుట్రలో తన అక్క పడిపోయిందని, తన అక్క అమాయకంగా మోసపోయిందని చెబుతుంది. అంతేకాని, తన అక్క వేరే తప్పు చేయలేదని, ఎవరైనా అంటే మాత్రం ఊరుకోను అని అంటుంది. ఇక రాజ్ సీరియస్ గా నీ అక్కతోపాటు, నిన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేయాలి అంటాడు. ఆ మాటతో ఇక కావ్య ‘ఆడది, నిజాయితీ’ అంటూ భారీ డైలాగులు కొట్టి, చివరకు తన అక్క తప్పు లేదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. తన అక్క మీద పడింది నింద మాత్రమేనని, నిజం కాదని నిరూపిస్తానంటుంది. ఇది భార్యభర్తల వాగ్వాదం కాదని, ఒక పురుషుడు, ఒక స్త్రీకి మధ్య అంతర్ యుద్ధం అని చెబుతుంది.

మరోవైపు స్వప్న తన కడుపులో బిడ్డను తలుచుకొని, రాహుల్ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే, రాహుల్ గదిలోకి వస్తాడు. రావడం రావడమే, స్వప్నతో గొడవ మొదలుపెడతాడు. మహారాణిలా బెడ్ మీద కూర్చున్నావ్, తప్పు చేయడానికి సిగ్గులేదా అంటాడు. నేనేం తప్పు చేశా అని స్వప్న బదులు ప్రశ్నిస్తుంది. ఆ దరిద్రాన్ని నా నోటితో ఎందుకు చెప్పిస్తావ్ అని, నువ్వో తిరుగుబోతు అని అంటాడు. దానికి స్వప్న, ఈ మాట అన్నందుకే కింద చెంప పలగలకొట్టాను అని గుర్తు చేస్తుంది.  ఇంట్లోవారందరూ నువ్వు తప్పు చేయలేదని నమ్మినా, నేను నమ్మను అని రాహుల్ అంటాడు. నిజం త్వరలోనే బయటకు వస్తుందని స్వప్న చెబుతంది. దానికి రాహుల్, నిజం కాదు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతావ్ అని అంటాడు. అంటే నేను తప్పు చేయాలని నువ్వు కోరుకున్నావా అని స్వప్న అనుమానంగా అడగగా, కాస్త బెదిరిన రాహుల్ ఆలోచించి మరీ, సాక్ష్యాలు అలా ఉన్నాయ్ అని చెబుతాడు. అవి నిజం కాదు అని, తాను అరుణ్ కి డబ్బులు ఇచ్చాను కానీ, తప్పు చేసి ఇవ్వలేదు అని సమాధానం ఇస్తుంది. నిజం ఏంటో తాను నిరూపిస్తానని, అప్పటి వరకు నా దరిదాపుల్లో కూడా ఉండొద్దు అని రాహుల్ అంటాడు. దానికి స్వప్న, ఏకంగా రాహుల్ ని గదిలో నుంచి వెళ్లగొడుతుంది. తర్వాత డోర్ క్లోజ్ చేస్తుంది. చేసేదిలేక రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Brahma Mudi Serial Today 27th November 2023 Kavya Cobfronts Raj ram

ఇంట్లో అప్పూ ఒంటరిగా, తన తండ్రి చెప్పిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ ని మర్చిపోమ్మని వాళ్ల నాన్న చెప్పడంతో ఏం చేయాలో తెలీక ఆలోచిస్తూ ఉంటుది. అప్పుడే కనకం అక్కడికి వస్తుంది. నాన్న అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడుగుంది. కానీ, అప్పూ మాత్రం కాదని చెబుతుంది. మరి ఎందుకు ఏడుసున్నావ్ అంటే, నిజానికీ, అబద్ధానికి తేడా తెలిసినా ఏదీ తేల్చుకోలేకపోతున్నాను అని, అందుకే ఈ కన్నీళ్లు అంటుంది. అయితే, కనకం వాళ్ల నాన్న చెప్పినట్లు ఆలోచించమని అడుగుతంది.  అప్పూ మాత్రం ఆలోచిస్తున్నాను కానీ, తన వళ్ల కావడం లేదు అని చెబుతుంది. ‘కళ్యాణ్ పక్కన ఉన్నప్పుడు బాగుంది. దూరం అయ్యాకే బాధ కలిగుతోంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసినా మర్చిపోలేకపోతున్నాను.కళ్యాణ్ కూడా తనలాగే తిరిగాడుడ కదా? మరి తనకు ఎందుకు అలా అనిపించలేదని ప్రశ్నిస్తుంది. నేను రమ్మంటే ఎందుకు వచ్చాడు? గొడప పడితే ఎందుకు భరించాడు? కొడితే ఎందుకు పడ్డాడు? నిజంగా ఇది స్నేహమే అయితే, నాకు దెబ్బ తగిలితే వాడు ఎందుకు బాధపడ్డాడు? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్ననని తెలియగానే ఎందుకు విడిపించాడు? ఇంత ప్రేమ చూపిస్తే.. ఎవరికైనా ఆశ కలుగుతుంది కదా? ఒకవేళ వాడు  చూపించినంత ప్రేమ నేను చూపిచంలేదా? చూపించినా వాడు చూడలేదా? ఎవరో తెలియని అమ్మాయి ఉత్తరం రాస్తేనే తన మనసు అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ తన వెనక తిరిగే నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? పోనీలే అది నా ఖర్మ అని వదిలేద్దాం అనుకుంటే, ఫ్రెండ్ అనుకొని వెనకే తిరుగుతున్నాడు. నా ముందే అనామికతో క్లోజ్ గా ఉంటున్నాడు. మనసులో ఏదో బాధ. నాన్న చెప్పిన మాటలు తలుచుకుంటే, గుండెకి తెలుస్తోంది కానీ, మనసు వినడం లేదు.’ అని కనకం ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తుంది. అయితే, అప్పూ ప్రేమ తెలుసుకొని కనకం కూడా బాధపడుతుంది. అప్పూ ప్రేమను బతికించడానికి తాను ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తూ ఉంటుంది.

Brahma Mudi Serial Today 27th November 2023 Kavya Cobfronts Raj ram

రాజ్ నిద్రలేచే సమయానికి రాజ్ ముఖంలో ముఖం పెట్టి చూస్తుంటుంద కావ్య. ఏమైందే అని రాజ్ అంటే, తనకు జ్నానోదయం అయ్యింది అటూ రాజ్ కాళ్లు పట్టుకోబోతుంది. ఏంటి ఇది అంటూ రాజ్ అడిగితే, తన అక్క ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఈ రోజే పనులు మొదలుపెట్టబోతున్నాను అని , సెంటిమెంటల్ గా మీ పాదాలకు నమస్కారం చేసుకొని శ్రీకారం చేయబోతున్నాను అంటుంది. తాను మాత్రం ఆశీర్వాదం ఇవ్వను అంటాడు. అయితే, రాజ్ కాళ్లు పట్టుకొ కావ్య, ఆశీర్వాదం ఇస్తేకానీ వదిలిపెట్టను అంటుంది. కోపాన్ని కంట్రోల్ పెట్టుకొని మరీ తప్పక కావ్యకు ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ అని చెబుతాడు. ఆ తర్వాతే కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  అలా వెళ్లేటప్పుడు కూడా ఇద్దరూ సామేతలతో వాదించుకుంటూ ఉంటారు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

మరోవైపు అప్పూ గురించి కనకం ఆలోచిస్తూ ఉంటుంది. పెద్దమ్మ టిఫన్ చేయమని అప్పూని రమ్మంటుంది. అయితే, దానికి అప్పూ టిఫిన్ కాదు విషం పెట్టమని అడుగుతుంది. అయితే, ఆ మాటకు కనకం బాధపడుతుంది. మరీ అతిగా ఆలోచిస్తుంది. కాసేపటి తర్వాత కళ్యాణ్ తో అప్పూ పెళ్లి కష్టమా అని అడుగుతుంది. అదే జరిగితే కావ్య, స్వప్నలకు ఇబ్బంది అవుతుదని అంటుంది. 

కమింగ్ అప్ లో స్వప్నతో కావ్యతో మాట్లాడుతుంది. అరుణ్ సడెన్ గా అలా ఎందుకు మారాడా అని స్వప్న, కావ్యలు ఆలోచిస్తారు. ఆ తర్వాత వెంటనే, అరుణ్ కి స్వప్న డబ్బులు ఇచ్చిన విషయం మీకెలా తెలుసు అని రాహుల్ ని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios