ఐదు వారాలుగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్... వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మధ్య సయోధ్య కుదిరే సూచనలు లేవు. మనల్ని కంటెస్టెంట్స్ వలె వారు చూడటం లేదు. చెప్పాలంటే కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. దొంగల్లా కనిపిస్తున్నాము వాళ్లకు అని హరితేజ ఆరోపణలు చేసింది. ఒకటికి రెండుసార్లు వాళ్ళే ఫుడ్ తింటున్నారని గంగవ్వ సైతం అసహనం వ్యక్తం చేసింది.
Bigg Boss Telugu 8 live Updates|Day 36: 6వ వారం నామినేషన్స్ లిస్ట్!

6వ వారం నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ, సీత, పృథ్విరాజ్ నామినెట్ అయ్యారట.
మనుషుల్లా కూడా చూడటం లేదు, హరితేజ సంచలన కామెంట్స్
విష్ణుప్రియకు వైల్డ్ కార్డ్ ఎంట్రీల హీట్, నామినేషన్స్ వేళ బిగ్ ఫైట్!
సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కుతోంది. ఇక 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా, వారితో ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పోటీ పడాల్సి ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల హీట్ విష్ణుప్రియకు గట్టిగా తగిలింది. గౌతమ్, నయని పావని ఆమెను నామినేట్ చేశారు.

అమ్మ లేదా నీకు, గంగవ్వ మాటలకు నాగ మణికంఠ ఎమోషనల్
నాగ మణికంఠ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడనే అభిప్రాయం కంటెస్టెంట్స్ లో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వతో నాగ మణికంఠ ముచ్చట్లు పెడుతున్నాడు. ఆమెతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నీకు అమ్మ లేదా అని గంగవ్వ అడగడంతో... నాగ మణికంఠ ఒక ఎమోషనల్ సీన్ పండించాడు.
మొదటి రోజే బుక్ అయిన అవినాష్!
హౌస్ మేట్స్ అందరూ కలిసి మొదటి రోజే అవినాష్ ని బుక్ చేశారు. బండెడు గిన్నెలు కడిగే బాధ్యత అప్పగించారు. అయ్య బాబోయ్ అని అవినాష్ భయపడ్డాడు. అయితే నాగ మణికంఠ, హరితేజ కూడా గిన్నెలు కడిగి సహాయం చేశారు. పాటలతో పనిని మర్చిపోయారు.
బిగ్ బాస్ హౌస్లో గంగవ్వ డిమాండ్ మామూలుగా లేదుగా!
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఇంట్లో అజమాయిషీ చేస్తుంది. తనకు పాలు కావలసిందే అని పట్టుబట్టింది. రెండు క్లాన్స్ రేషన్ ఎలా పంచుకుంటారు. సర్దుకుంటారనే ఆసక్తి నెలకొంది.

మొద్దు పోరడు, అవినాష్ పై గంగవ్వ కామెడీ పంచులు!
ఉదయాన్నే గంగవ్వతో నాగ మణికంఠ, హరితేజ, నయని పావని.. గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టారు. ఇంకా నిద్రలేవని అవినాష్ పై గంగవ్వ పంచులు వేసింది. మొద్దు పోరడు. నిద్ర లేవడు అంటూ ఎగతాళి చేసింది.
6వ వారం నామినేషన్స్ లిస్ట్! ఇంటిని వీడేది ఎవరు?
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారింది. ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. కాగా 6వ వారం నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ, సీత, పృథ్విరాజ్ నామినెట్ అయ్యారట.