05:50 PM (IST) Sep 13

ఆదిత్య ఓం, నబీల్‌, పృథ్వీరాజ్‌లను ఏడిపించిన బిగ్‌ బాస్‌.. తండ్రిలేని లోటు ఎలా ఉంటుందంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో ఇప్పటి వరకు టాస్క్ ల కోసం ఫైటింగ్‌ చూశారు. కానీ ఇప్పుడు వారిలోని ఎమోషన్స్ ని ఆవిష్కరించాడు బిగ్‌ బాస్‌. పేరెంట్స్ లేని లోటుని గుర్తు చేస్తూ, వారి జ్ఞాపకాలు పంచుకునేలా చేస్తూ ఆదిత్య ఓం, నబీల్‌, పృథ్వీరాజ్‌ లను ఏడిపించాడు. హౌజ్‌మేట్స్ చేత కన్నీళ్లు పెట్టించాడు. తాజాగా విడుదలైన లేటెస్ట్ బిగ్‌ బాస్‌ ప్రోమో ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. 

YouTube video player

02:46 PM (IST) Sep 13

కంటెస్టెంట్స్ ని ఏడిపించిన బిగ్ బాస్, వాల్యూబుల్ గిఫ్ట్స్ ఆ 5 గురికే!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అదే సమయంలో ఏడిపించేశాడు. తమ ప్రియమైన వారికి సంబంధించిన ఒకప్పటి వస్తువులు, గిఫ్ట్స్ హౌస్లోకి తెచ్చాడు. 13 మందిలో తమ వారికి చెందిన ఆ వస్తువులను పొందే అవకాశం 5గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఇచ్చాడు. వాటితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. 

Scroll to load tweet…
12:12 PM (IST) Sep 13

బిగ్ బాస్ ప్రేక్షకులను ఉసూరుమనిపించిన జ్యోతి రాయ్!

జ్యోతి రాయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తే పండగే అని ఆడియన్స్ భావించారు. కానీ జ్యోతిరాయ్ షోకి రావడం లేదట. దీనిపై ఆమె స్వయంగా స్పష్టత ఇచ్చింది. నేను కన్నడ, తెలుగు బిగ్ బాస్ షోలలో పాల్గొనడం లేదు. నటిగా బిజీగా ఉన్నాను. నేను నటించిన 4 తెలుగు సినిమాలు 2025లో విడుదల కానున్నాయి. బిగ్ బాస్ షోకి వస్తున్నానంటూ వెలువడుతున్న కథనాల్లో నిజం లేదు. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అని జ్యోతిరాయ్ అన్నారు. 

బిగ్ బాస్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్!

10:14 AM (IST) Sep 13

ట్రూత్ ఆర్ డేర్: యాష్మి గౌడ హౌస్లో చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏమిటీ?

బిగ్ బాస్ కాకరేపే ఫిజికల్ గేమ్స్ తో పాటు ఎంటర్టైనింగ్ గేమ్స్ సైతం కండక్ట్ చేస్తున్నాడు. తాజాగా కంటెస్టెంట్స్ తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించాడు. దీనిలో భాగంగా యాష్మి గౌడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక చెప్పిన అతిపెద్ద అబద్దం బయట పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె చెప్పిన ఆ అబద్ధం ఏమిటీ?

YouTube video player

06:44 AM (IST) Sep 13

మస్ట్ షేడ్స్ చూపిస్తున్న సోనియా, నిన్న బ్రేకప్ నేడు లింకప్!

వరుస గేమ్స్ లో గెలిచి నిఖిల్ సత్తా చాటాడు. దాంతో అతని మీద ఒపీనియన్ మారిపోయింది. నీ వల్లే నా గేమ్ పాడవుతుందని నిఖిల్ ని ఛీ కొట్టిన సోనియా, అతడు టాస్క్స్ గెలిచి ప్రైజ్ మనీ పెంచుకోవడంతో వచ్చి చేయి పట్టుకుని కూల్ చేసింది. ఇవన్నీ గమనిస్తున్న ఆడియన్స్ సోనియాలో మస్తు షేడ్స్ ఉన్నాయని అంటున్నారు.

ఒక క్యారెక్టర్ లో ఇన్ని షేడ్షా! అంతలోనే బ్రేకప్ అండ్ లింకప్!