బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి స్పెషల్ గెస్ట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చాడు. హౌజ్‌లోకి వెళ్లి బిగ్ షాక్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ నాగ మణికంఠని ఎలిమినేట్ చేసి తీసుకెళ్లాడు. దీంతో అందరు షాక్ అయ్యారు. అయితే ఇది పెద్ద ఫ్రాంక్ అంటూ ట్విస్ట్ ఇవ్వడం విశేషం. అనంతరం చివరి రెండు జంటలతో ఆయన గేమ్ ఆడించి సందడి చేశారు. 14 మందితో బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ ముగిసింది. నాగ్ చివర్లోవిన్నర్ కి జీరో రెమ్యూనరేషన్ అంటూ షాకిచ్చాడు నాగ్. హౌజ్‌ని లాక్ చేశాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో అసలు రచ్చ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. మరి ఏ స్థాయిలో అలరిస్తుందనేది చూడాలి.
- Home
- Entertainment
- TV
- Bigg boss telugu 8 Live updates : 14 మంది కంటెస్టెంట్లతో బిగ్ స్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ ముగిసింది
Bigg boss telugu 8 Live updates : 14 మంది కంటెస్టెంట్లతో బిగ్ స్ తెలుగు 8 గ్రాండ్ ఓపెనింగ్ ముగిసింది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ పేజీ ఇది. ఈ షోలో జరిగిగే విశేషాలను, వివాదాలను, వీడియోలను, రివ్యూలను, కంటెస్టెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
హౌజ్‌లోకి డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఫస్ట్ ఎలిమినేషన్ అంటూ షాక్
పద్నాలుగో కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రిదీ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి పద్నాలుగో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూర్ నబీల్ అఫ్రిదీ ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో స్ట్రగుల్ అయి యూట్యూబర్‌గా నిలబడ్డాడు. కానీ కెరీర్‌లో సెటిల్ కాలేకపోయాడు. దీంతో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా మారాడు. ఇప్పుడు ఆయన ఏం చేసినా లక్షల్లో వ్యూస్, డబ్బులు వస్తున్నాయని తెలిపారు నబీల్ అఫ్రిదీ. నటుడు కావాలనేది తన డ్రీమ్ అని, బిగ్ బాస్ షో అనేది తనకు పెద్ద స్టేజ్ అని, ఇందులో తానేంటో నిరూపించుకుంటా అని తెలిపారు నబీల్ అఫ్రిదీ. ఆయనది వరంగల్ కావడం విశేషం.
పదమూడో కంటెస్టెంట్‌గా డాన్సర్ నైనికా ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి పదమూడో కంటెస్టెంట్‌గా డాన్సర్ నైనికా ఎంట్రీ ఇచ్చింది. ఢీ షోతో పాపులర్ అయిన ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.
పన్నెండో కంటెస్టెంట్‌గా యాంకర్ విష్ణు ప్రియా ఎంట్రీ.. మాస్ డాన్స్ తో రచ్చ..
బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణు ప్రియా ఎంట్రీ ఇచ్చింది. ఆమె మాస్ డాన్స్ తో షోలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. సోషల్ మీడియాలో గ్లామర్ తో దుమ్మురేపే విష్ణు ప్రియా హౌజ్‌లోకి పృథ్వీరాజ్‌తో పెయిర్‌గా లోపలకి వెళ్లింది. అయితే ఈ ఇద్దరికి నాగ్ ఓ క్విజ్ పెట్టారు. మొదటి ప్రశ్నకి పృథ్వీ రాజ్ ఆన్సర్ చెప్పాడు. కానీ రెండో ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు. దీంతో నాగ్ `దేశముదుర్లు` అంటూ వర్ణించడం విశేషం.
పదకొండో కంటెస్టెంట్‌గా పృథ్వీరాజ్ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి పదకొండో కంటెస్టెంట్‌గా సింగర్ పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. తన పేరు, డబ్బు, పాపులారిటీ కోసం తాను వచ్చినట్టు తెలిపారు. అదిరిపోయే డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో ఎంట్రీ ఇవ్వడం విశేషం. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో, తనతో హౌజ్‌లోకి రావాలో ఆర్ట్ వర్క్ వేయడం విశేషం.
హౌజ్‌లో మరో ట్విస్ట్.. రెండో బ్యాడ్ న్యూస్ రివీల్..
బిగ్ బాస్ తెలుగు 8 లో హౌజ్ మేట్స్ కి మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. రెండో బ్యాడ్ న్యూస్ రివీల్ చేశాడు. ఈ సారి హౌజ్‌లో రేషన్ లేదని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే రేషన్‌ని గెలుచుకోవాలని, ఫ్రీగా ఏదీ రాదని, ప్రతిదీ గెలుచుకోవాలని తెలిపారు నాగ్.
బిగ్ బాస్ హౌజ్‌లోకి స్పెషల్ గెస్ట్ గా హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి హీరో నాని ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు హీరోయిన్ ప్రియాంక మోహన్‌ని కూడా తీసుకొని వచ్చారు. వీరు కలిసి నటించిన `సరిపోదా శనివారం` సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే సరదాగా నాగ్.. వీరిని బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించి కొత్తగా వెళ్లిన మూడు జంటలతో గేమ్ ఆడించారు.
పదో కంటెస్టెంట్‌గా నాగ మణికంఠ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి పదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. పుట్టిన రెండేళ్లకి నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఆమె మరో పెళ్లి చేసుకుంది. 2019లో ఆమె కన్నుమూసింది. దీంతో ఒంటరైపోయాడు. ఆ తర్వాత పెళ్లిచేసుకున్నాడు. కూతురు పుట్టింది. తన తల్లినే కూతురిగా వచ్చిందని భావించాడు. కానీ తన భార్య తనని దూరం పెట్టింది. దీంతో మళ్లీ ఒంటరైపోయాడు మణికంఠ. తనని తాను నిరూపించుకునేందుకు, తన గౌరవాన్ని తిరిగి పొందేందుకు బిగ్ బాస్ షోకి వచ్చినట్టు తెలిపారు మణికంఠ. ఆయన కిర్రాక్ సీతతో కలిసి పెయిర్‌గా హౌజ్‌లోకి వెళ్లడం విశేషం.
బిగ్ బాస్ హౌజ్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా `బేబీ` ఫేమ్ కిర్రాక్ సీత ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా `బేబీ` ఫేమ్ కిర్రాక్ సీత ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇక్కడి వరకు వచ్చానని తెలిపింది కిర్రాక్ సీత. తాను స్ట్రాంగ్ అని, కేరింగ్ అని, కాన్ఫిడెంట్ అని, రెస్పాన్సిబుల్ అని వెల్లడించింది కిర్రాక్ సీత.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా శేఖర్ బాషా ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్ గా శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఆర్జేగా కెరీర్ ని ప్రారంభించాడు. అంతకు ముందు ఎన్నో ప్రాంతాలు తిరిగినట్టు తెలిపారు. ఇలా దేశం మొత్తం తిరిగి ఆర్జేగా మారినట్టు తెలిపారు. ఆర్జేగా తాను అత్యధిక అవార్డులు తీసుకున్నట్టు తెలిపారు. ఆర్జేగా గంటలపాటు మాట్లాడటం తన స్పెషాలిటీ అని, అనర్గళంగా మాటలు వస్తాయని తెలిపారు శేఖర్ బాషా. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా జంటగా వెళ్లారు.
ఏడో కంటెస్టెంట్‌గా బేజవాడ బేబక్క అదిరిపోయే ఎంట్రీ
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. యూట్యూబర్‌గా పాపులర్ అయ్యింది బేబక్క. అనేక ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ అలరించారు. ఫన్నీ వీడియోలతో మెప్పించారు. ఆమె పెళ్లై విడాకులు కూడా తీసుకుందట. అంతేకాదు స్టేజ్‌పై నాగార్జునపై పాట పాడి అలరించారు. అంతకు ముందు ఆమె నాగ్‌కి లవ్ సింబల్స్ పై ఆయనపై ప్రేమని వ్యక్తం చేస్తూ చేసిన రచ్చ వేరే లెవల్
బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా సోనియా ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా సోనియా ఎంట్రీ ఇచ్చారు. అదిరిపోయే డాన్స్ తో అలరించింది. ఆమెకి రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేయడం విశేషం.
బిగ్ బాస్ హౌజ్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా నటుడు ఆదిత్య ఓం ఎంట్రీ..
ఒకప్పుడు హీరోగా అలరించిన ఆదిత్య ఓం ఐదో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఆయన ఆ తర్వాత ఫేడౌట్ అయ్యారు. కానీ తనని తాను రీ బర్త్ కోసం నటుడిగా మళ్లీ రాణించడం కోసం ఆయన ఈ షోకి వస్తున్నట్టు తెలిపారు ఆదిత్
బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. ఈ సీజన్‌కి కెప్టెన్ లేరు..
బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా ప్రారంభమైంది. నలుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్‌లో కెప్టెన్ లేడని తెలిపారు నాగ్. కెప్టెన్ లేకుండానే హౌజ్ నడుస్తుందని, ఎవరికీ ఇమ్యూనిటీ ఉండదు అని తెలిపి షాక్ ఇచ్చాడు నాగ్. దీంతోపాటు మరో రెండు బ్యాడ్ న్యూస్‌లు ఉన్నట్టు చెప్పారు.
స్పెషల్ గెస్ట్ గా రానా ఎంట్రీ.. `35` సినిమా టీమ్, నివేదా థామస్, విశ్వదేవ్ సందడి..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఇప్పటికే నలుగు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం స్పెషల్ గెస్ట్ గా రానా సందడి చేశారు. ఆయన `35` సినిమాని నిర్మించారు. ఆ మూవీ టీమ్‌ని పరిచయం చేశారు. నివేదా థామస్, విశ్వదేవ్ లు సైతం బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. హౌజ్‌లోకి రెండు కపుల్స్ కి గేమ్ పెట్టారు. ఇందులో యాష్మి, నిఖిల్ జంట విన్నర్ గా నిలిచింది. అనంతరం హౌజ్‌ని తిలకించారు రానా, నివేదా. వీరి ఎంట్రీతో హౌజ్‌లో సందడి వాతావరణం నెలకొంది.
నాల్గో కంటెస్టెంట్‌గా ప్రేరణ ఎంట్రీ..
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి నాల్గో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ సాంగ్‌లతో ఆమె దుమ్మురేపింది. అనంతరం చలాకీగా సమాధానాలు చెబుతూ అలరించింది. ఆమెకి పెళ్లై ఎనిమిది నెలలే అవుతుంది. ఈ సందర్భంగా ప్రేరణకి క్విజ్ పెట్టాడు నాగ్. అందులో తన భర్తకి సంబంధించిన ప్రశ్నలు ఉండటం విశేషం. అయితే ఆమె పెయిర్‌గా అభయ్ నవీన్‌తో కలిసి హౌజ్‌లోకి వెళ్లడం విశేషం. హీరోయిన్ రష్మిక మందన్నా మంచి ఫ్రెండ్ అని తెలిపింది ప్రేరణ
మూడో కంటెస్టెంట్‌గా అభయ్ నవీన్ ఎంట్రీ.. కన్నీటి గాథ..
బిగ్ బాస్ తెలుగు 8లోకి మూడో కంటెస్టెంట్‌గా నటుడు అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. `పెళ్లి చూపులు` చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు అభయ్. సినిమాలు చూస్తూ పెరిగిన ఆయన సినిమాల్లో రాణించాలని చెప్పి అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో కోర్స్ చేసి అట్నుంచి నటుడిగా మారాడు. పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా మారి `రామన్న యూత్` అనే చిత్రాన్ని తీశాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఫలితం సంబంధం లేకుండా ఆ సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పాడు అభయ్. అయితే నానా కష్టాలు పడి ఆ సినిమా తీశాక ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక నాన్న చూశాడట. ఆ మరుసటి రోజు ఆయన చనిపోయాడట. తన జీవితంలో అతిపెద్ద విషాదం. అది తట్టుకోలేక ఆ సినిమాని పక్కన పెట్టాడట. కోలుకుని కొన్నాళ్లకి మళ్లీ ఆ సినిమాని రిలీజ్ చేసినట్టు తెలిపారు అభయ్. ఇప్పుడు ఆయన తనని తాను నిరూపించుకునేందుకు, తన సర్వైవల్ కోసం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపాడు అభియ్ నవీన్
రెండో కంటెస్టెంట్‌గా నటుడు నిఖిల్ ఎంట్రీ.. పెయిర్‌గా హౌజ్‌లోకి..
బిగ్ బాస్ తెలుగు 8 రెండో కంటెస్టెంట్‌గా నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే మాస్ డాన్సులతో ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. హీరోగా, విలన్‌గా ఆయన సినిమాలు చేశాడని తెలిపారు. అయితే ఈసారి జంటలుగా హౌజ్‌లోకి పంపిస్తున్నారు నాగార్జున. యష్మి, నిఖిల్ లను పెయిర్‌గా హౌజ్‌లోకి పంపించడం విశేషం. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 8లోకి ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి ఎంట్రీ..
నటి యష్మి బిగ్ బాస్ తెలుగు 8లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇవ్వడం విశేషం. అదిరిపోయే పాటతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. తనకు ఆల్‌రెడీ లవ్ బ్రేకప్ అయ్యిందని, తనకు సెట్ కాలేదని అందుకే బ్రేకప్ చెప్పినట్టు తెలిసింది. బిర్యానీ అంటే ఇష్టమన్నారు.
గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం..
గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమైంది. నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. దేవర పాటకి ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఎంట్రీ అనంతరం బిగ్ బాస్ హౌజ్‌ని చూపించారు నాగ్. అంతేకాదు ఈ సారి హౌజ్ ప్రకృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. అలాగే ఓ స్పెషల్ రూమ్ ఉందని, ఇన్‌ఫినిటీ రూమ్ ఉందని చెప్పారు నాగ్