Asianet News TeluguAsianet News Telugu

Bhrammamudi Serial Today :స్వప్నని వదిలించుకోవడానికి అరుణ్ కి రాహుల్ ఎర, రాజ్ కి చుక్కలు చూపించిన కావ్య

వారం రోజుల్లో హాస్పిటల్ పనులు మొదలు పెట్టేలా చేస్తానని, అలాగే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు. అరుణ్ కూడా వెంటనే ఒకే చెబుతాడు.
 

Bhrammamudi Today November 15th : kavya Redicules Raj ram
Author
First Published Nov 15, 2023, 10:07 AM IST

Bhrammamudi Today:నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ అప్పూ, అనామికలను కలవడానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే అనామికతో పెళ్లి జరిపించడానికి ఇంట్లో వారు ముహూర్తాలు చూస్తున్నారని ఆనందంగా చెబుతాడు. వెంటనే అనామిక వెళ్లి, కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అది చూసి అప్పూ బాగా ఫీలౌతుంది. ఆమె కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఈ విషయం మా డాడ్ కి చెప్పాలి అని, అనామిక ఫోన్ తీసుకొని పక్కకు వెళుతుంది. ఇక, కళ్యాణ్ అప్పూతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు కోపం వస్తే ఆగదు, తనకు సంతోషం వస్తే ఆగదు అని చెబుతూ ఉంటాడు. చూస్తే, అప్పూ వెళ్లిపోతూ ఉంటుంది. కళ్యాణ్ పిలుస్తూ ఉంటాడు. కానీ, అప్పూ వినిపించుకోకుండా వెళ్లిపోతూ ఉంటుంది. బ్యాగ్రౌండ్ లో ‘వెళిపోతోంది ప్రాణమే, కనపడుతోంది శూన్యమే’ పాట వస్తూ ఉంటుంది. అప్పూ కూడా నిరాశగా వెళుతూ ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ బైక్ మీద వస్తే, అతనితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పూ అలా ఎందుకు వెళ్లిందో అర్థం కాక, కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా, అనామిక వచ్చి, అప్పూ ఏది అని అడుగుతుంది. తనకు అర్జెంట్  ఫోన్ వస్తే, వెళ్లిందని అబద్దం చెబుతాడు. నీకంటే పనే ముఖ్యమా తనకి అని అనామిక అడగగా, తెలుసుకుంటాను అని కళ్యాణ్ అంటాడు. 

Bhrammamudi Today November 15th : kavya Redicules Raj ram

ఇక, సీన్ కట్ చేస్తే, రాహుల్ తన కుట్రను మొదలుపెడతాడు. గతంలో స్వప్నను పెళ్లి చేసుకోవాలని ఆశపడిన డాక్టర్ అరుణ్ ని పట్టుకుంటాడు. అతనిని మాట్లాడాలని చెప్పి, ఓ ప్రదేశానికి తీసుకువస్తాడు. అక్కడకు వచ్చిన అరుణ్, ఏంటి సర్ ఏదో మాట్లాడాలన్నారు అని కాస్త భయంగానే అడుగుతాడు. దీంతో, రాహుల్ తన నాటకం మొదలుపెడతాడు. ‘నా భార్యతో నీకు సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తాడు. అయితే, ఆ ప్రశ్నతో బిత్తరపోయిన అరుణ్.. అయ్యో మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదని చెబుతాడు. ‘నేనేమి అనుకుంటున్నానో నీకు ఎలా తెలుసురా?’ అంటూ అరుణ్ ని భయపెట్టడానికి రాహుల్ ప్రయత్నిస్తాడు. స్వప్న తాను కాలేజీ లో ఫ్రెండ్స్ అని చెబుతాడు. అయితే, రాహుల్ నువ్వు స్వప్నకి ప్రపోజ్ చేశావ్ అని తనకు తెలుసని, తనతో లేచిపోయిందని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చావ్ అని కూడా తెలుసు అని అన్ని విషయాలు బయటపెడతాడు. నిజం చెప్పమని బెదిరిస్తాడు. అరుణ్ భయంతో వణికిపోవడంతో, రాహుల్ చిన్నగా నవ్వేస్తాడు.

‘భయపడ్డావా? నిన్ను ఏదో చేయడానికి ఇక్కడికి తీసుకురాలేదు. నీకు హెల్ప్ చేద్దామని తీసుకువచ్చాను. నువ్వు సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నావ్. కానీ, పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నావ్, ఆ పర్మిషన్ నేను, నీకు ఇప్పిస్తాను’ అని రాహుల్ అరుణ్ కి చెబుతాడు. అందుకోసం తనకు ఓ సహాయం చేయాలని అడుగుతాడు. ఏంటని అరుణ్ అడగగా, అసలు కుట్రను బయటపెడతాడు. తన భార్య స్వప్నతో రిలేషన్ పెట్టుకున్నట్లు నటించాలని, అది తన ఇంట్లో వారందరూ నమ్మేలా చేయాలి అని అడుగుతాడు. పెళ్లి తర్వాత కూడా నీతో తిరుగుతున్నట్లు అందరూ నమ్మేలా చేయాలని కోరతాడు. ఎందుకు అని అరుణ్ ప్రశ్నించగా, నీకు హాస్పిటల్ పర్మిషన్ కావాలా వద్దా అని అంటాడు. దీంతో, అతను చెప్పిన డీల్ కి అరుణ్ ఒకే చెబుతాడు. వారం రోజుల్లో హాస్పిటల్ పనులు మొదలు పెట్టేలా చేస్తానని, అలాగే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తాడు. అరుణ్ కూడా వెంటనే ఒకే చెబుతాడు.

Bhrammamudi Today November 15th : kavya Redicules Raj ram

ఇక, సీన్ కట్ చేస్తే, ఉదయం అందరూ హాల్ లోకి వచ్చి చూడగా, ఓ బోర్డు కనపడుతుంది. దాని మీద ‘సారీ కళావతి’ అని రాసి ఉంటుంది. అది చూసి ఇంట్లోవారు ఒక్కొక్కరుగా షాకౌతూ ఉంటారు. అది రాజ్ రాశాడని అందరూ అనుకంటూ ఉంటారు. కావ్య ను రాజ్ మాత్రమే కళావతి అని పిలుస్తాడు. ఇదంతా కావ్య ప్లానే. రాజ్ రాసినట్లుగా తానే రాసి, ఏమీ తెలియనట్లుగా, తాను కూడా కిందకు వచ్చేస్తుంది.  ఏమీ తెలియనట్లు అందరి ముందు కావ్య తన నాటకం మొదలుపెడుతుంది. ఏమైంది? అందరూ ఇక్కడ నిలపడ్డారు అని కావ్య అడుగుతుంది. దాంతో, రుద్రాణి అయ్యో నీకేమీ తెలీదా అని వెటకారంగా అడుగుతుంది. అప్పుడు కావ్య నవ్వుకుంటూనే రుద్రాణిపై పంచ్ వేస్తుంది. మీ గురించి అంతా తెలుసు అని, ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది. తన గురించి కాదని, ఈ బోర్డ్ గురించి అని చూపిస్తుంది.

Bhrammamudi Today November 15th : kavya Redicules Raj ram

అది చూసి,  కావ్య ఏమీ తెలియనట్లుగా.. ఎవరు పెట్టారు ఈ బోర్డ్ అని అడుగుతుంది. దీంతో, ధాన్యలక్ష్మి ఇంకెవరు పెడతారు? నీ మొగుడు రాజ్ అని చెబుతుంది. ఇక కావ్య తన పర్ఫార్మెన్స్ మొదలుపెడుతుంది. అంతలోనే రాజ్ వాకింగ్ కి వెళ్లి వస్తాడు. అందరూ మీటింగ్ పెట్టారు? ఏం జరిగింది అని అడుగుతాడు. వాళ్ల సమాధానాలు కూడా వింతగా ఉండటంతో రాజ్ కి ఏమీ అర్థం కాదు.  తీరా బోర్డు చూసి షాకైపోతాడు. నాకు మీరు సారీ చెప్పడం ఏంటి అని ఏమీ తెలియనట్లుగా కావ్య నటిస్తుంటే, రాజ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయ్. ఎవరికీ వినపడకుండా తన యాక్టింగ్ బాగుందా అని అడుగుతుంది. ఇంట్లో అందరి ముందు బుక్ అయినందుకు ఏం మాట్లాడాలో కూడా రాజ్ కి అర్థం కాదు. ఈ సీన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది.

ఎందుకు సారీ చెప్పావ్ అని ఒకరి తర్వాత మరొకరు అడుగుతూనే ఉంటారు. దీంతో, కావ్యనే సమాధానం చెప్పమని అడుగుతాడు. ఇక, కావ్య తనకు నచ్చిన సమాధానం చెబుతుంది. వారం రోజులుగా తనతో సరిగా మాట్లాడలేదని, తన తప్పులేదని అర్థం చేసుకున్నారు. అందుకే ఇలా సారీ చెప్పారు అని చెబుతుంది. ఇక, తప్పక రాజ్ కూడా అదే నిజం అని అంగీకరిస్తాడు. ఇక, బోర్డు మీద రాయడం ఎందుకు డైరెక్ట్ గా సారీ చెప్పమని ఇంట్లో వారందరూ బలవంత పెట్టడంతో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, కావ్య రాజ్ నోరు మూసేసి ఆపేస్తుంది. మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి వద్దు అండి అంటుంది. కావ్య యాక్టింగ్ చూసి రాజ్ నోరెళ్ల పెట్టి చూస్తూ ఉండిపోతాడు. అందరూ, వారి మధ్య నిజంగా ప్రేమ ఉందనుకొని సంతోషపడతారు. అపర్ణ, రుద్రాణి ముఖాలు మాత్రం మాడిపతాయి.


ఇక, కళ్యాణ్ పెళ్లి వార్త విని అప్పూ బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోపు కళ్యాణ్ అక్కడికి వస్తాడు.అప్పూ తన గది నుంచి బయటకు రావడానికి ఇష్టపడదు.  కానీ , వాళ్ల పెద్దమ్మ బలవంత పెట్టడంతో ఇక, బయటకు వస్తుంది. ఇక, కళ్యాణ్ సిగ్గుపడుతూ తనకు పెళ్లి ఫిక్స్ అయ్యందనే విషయాన్ని కనకం ముందు చెబుతాడు. కనకం సంతోషిస్తుంది. అయితే, మీరు సంతోషించారు కానీ, అప్పూ సంతోషించలేదు అని కళ్యాణ్ బాధపడతాడు. దానికి అప్పూరివర్స్ లో మాట్లాడుతుంది. ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకుంటారని, దాంట్లో గొప్పేమీ లేదు అని, తనకు ఎవరూ లేరని, తాను ఒంటరి అనుకుంటూ గదిలోకి పరుగు తీస్తుంది.

ఇక, లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఇక, కళ్యాణ్ అప్పూ మునుపటిలా లేదని వాపోతాడు. అంతేకాకుండా, తన పెళ్లి బాధ్యత మొత్తం అప్పూనే చూసుకోవాలి అని కనకం కి చెప్పి వెళతాడు. వాళ్లు కూడా మీ పెళ్లికి అప్పూ లేకుండా ఎలా ఉంటుందని? అన్ని పనులు తానే చూసుకుంటుందని హామీ ఇస్తారు. దీంతో, కళ్యాణ్ వెళ్లిపోతాడు. ఇక, అప్పూ తన కబోర్డ్ లో తాను దాచుకున్న కళ్యాణ్ ఫోటో కోసం వెతుకుతుంది. దాని వెనక ఐలవ్ యూ అని రాసి ఉంటుంది. ఆ ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది.

ఇక, తన గదిలోకి వెళ్లిన కావ్య పై రాజ్ సీరియస్ అవుతాడు.‘ నువ్వు చేసిన పని ఏంటి?’ అని అడుగుతాడు. దానికి కావ్య సంబంధం లేకుండా వంట గురించి చెబుతూ ఉంటుంది. దీంతో, రాజ్ కి చిర్రెక్కిపోతూ ఉంటుంది. కమింగ్ అప్ లో రాహుల్ వేసిన ప్లాన్ ని వర్కౌట్ చేస్తుంటాడు. అరుణ్ ఫోటోతో స్వప్నకి కొరియర్ వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios