చిత్ర పరిశ్రమలో జరిగే కొన్ని విషాదాలు ఊహకి కూడా అందవు. అలాంటి పెను విషాదమే తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో జరిగింది. బుల్లితెరపై సీరియల్స్ లో రాణిస్తూ గుర్తింపు పొందిన యువ నటి శృతి షణ్ముగప్రియ తన భర్తని కోల్పోయింది.

చిత్ర పరిశ్రమలో జరిగే కొన్ని విషాదాలు ఊహకి కూడా అందవు. అలాంటి పెను విషాదమే తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో జరిగింది. బుల్లితెరపై సీరియల్స్ లో రాణిస్తూ గుర్తింపు పొందిన యువ నటి శృతి షణ్ముగప్రియ తన భర్తని కోల్పోయింది. పెళ్లైన ఏడాదిలోనే ఈ సంఘటన జరగడంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. 

శృతి భర్త అరవింద్ శేఖర్ ఆగస్ట్ 2న గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం అరవింద్ ఒక్కసారిగా గుండెపోటుకి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అరవింద్ శేఖర్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటనతో శృతి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అరవింద్ ఇలా యుక్త వయసులోనే అదికూడా పెళ్ళైన ఏడాది లోపే మరణించడం అతడి ఫ్యామిలీ, సన్నిహితులు జీర్ణించుకోలేకున్నారు. 

View post on Instagram

శృతి టివి సీరియల్స్ లో రాణిస్తూ బిజీగా ఉంది. ఇక అరవింద్ వెయిట్ లాస్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. అంతే కాదు అరవింద్ బాడీ బిల్డర్ గా కూడా గుర్తింపు పొందారు. శృతి, అరవింద్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక రీల్స్, ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అరవింద్ మరణ వార్త ఎవ్వరికి నమ్మశక్యం కావడం లేదు. 

View post on Instagram

వారంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం పాటు శృతి, అరవింద్ శేఖర్ డేటింగ్ లో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. శృతి షణ్ముగప్రియ వాణి రాణి, భారతి కన్నమ్మ, కళ్యాణ పరిసు లాంటి సీరియల్స్ తో గుర్తింపు పొందింది. భర్తతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కేరీర్ లో కొనసాగుతున్న వేళ ఆమె జీవితం విషాదంగా మారింది. 

View post on Instagram