బాలీవుడ్ ప్రముఖ నటి, సాథ్‌ నిబానా సాథియా’(కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్‌ ఫెమ్  దెబోలినా భట్టాచార్య హత్య కేసులో విచారణను ఎదుర్కోవడం ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. 

రీసెంట్ గా ఒక మర్డర్ కేసులో నటికి సంబందించిన వివరాలు దొరకడంతో ఆమెకు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారించేందుకు ముంబై పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. 

అసలు వివరాల్లోకి వెళితే..  ముంబైకి చెందిన రాజేశ్వర్‌ ఉడాని అనే వజ్రాల వ్యాపారి గత కొన్ని రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టగా ఈ నెల 5న రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన శవంను పోలీసులు గుర్తించి పోస్టుమార్టం చేయగా ఆ మృతదేహం రాజేశ్వర్ దేనని గుర్తించారు. 

అతని కాల్ డేటాను పరిశీలించగా రాజకీయ నాయకుడు సచిన్ పవర్ ద్వారా పలువురు మహిళలతో రాజేష్ కు పరిచయం ఏర్పడినట్లు కనుగొన్నారు. సచిన్ పవర్ తో పాటు సినీ నటి దెబోలినా భట్టాచార్యను కూడా పోలీసులు విచారణలో భాగంగా పిలిపించి కేసును ముందుకు తీసుకెళుతున్నారు. దెబోలినా భట్టాచార్య నటించిన హిందీ సీరియల్ ను తెలుగులో (కోడలా కోడలా కొడుకు పెళ్లామా) డబ్ చేయగా ఆమె గోపిక గా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గ్గరయ్యారు.