Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో దివ్య అమ్మ డాక్టర్ అయిన కొత్తలో క్లీనిక్ పెట్టించి పేదలకు తక్కువ ఖర్చులో వైద్యం చేయాలని చెబుతూ ఉండేది. అమ్మ కోరిక కోరికగానే మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఆ కోరిక తీర్చాలి అనుకుంటున్నాను అని అంటుంది దివ్య. కోరికలు మాటలు చెప్పడానికి బాగా ఉంటాయి దివ్య కానీ దిగితేనే తెలుస్తుంది. నా ఆకలి తీరనప్పుడు నేను వేరే వాళ్ళ ఆకలి ఎలా తీరుస్తాను అంటూ సెల్ఫిష్ గా మాట్లాడుతాడు అభి. నేను నిన్ను తప్పు పట్టడం లేదు అన్నయ్య కానీ ఇప్పుడే మొదలుపెట్టను కొంచెం ట్రైనింగ్ అయిన తర్వాత మళ్లీ మొదలు పెడతాను అంటుంది దివ్య. అప్పుడు నందు చాలా మంచి ఆలోచన దివ్య అని పొగుడుతూ ఉంటాడు.
అప్పుడు లాస్య అయితే రేపటి నుంచి మనం కేఫ్ కి పేదలన్ని పిలిచి ఉచితంగా వైద్యం ఇప్పిద్దామా అనడంతో నువ్వు వెటకారంగా అన్న నేను కూడా అదే మనసులో అనుకున్నాను లాస్య అంటాడు నందు. దానం ఇవ్వడం అంటే మనకున్న అంత దానం చేయడం కాదు ఉన్నలో కొంచెం ఇవ్వడం మన సంతోషంతో పాటు ఎదుటి వ్యక్తి సంతోషం కూడా కోరుకోవాలి అంటుంది తులసి. అప్పుడు లాస్య ఇల్లు తాకట్టు పెట్టుకుంటాను అన్నప్పుడు ఈ సూత్రం గుర్తు రాలేదా తులసి అని అడుగుతుంది. అప్పుడు తులసి రివర్స్లో కౌంటర్ ఇస్తూ నువ్వు మోసం చేసి ఇంటిని నీ పేరు మీద రాయించుకోకుండా ఉంటే ఇచ్చేదాన్నేమో అని అంటుంది.
అప్పుడు అభి నేను ఇంతకుముందు పనిచేస్తున్న హాస్పిటల్ లో రికమెండ్ చేయాలా అనడంతో తొందరగా ఆ పని చెయ్ అని అంటాడు నందు. రికమండేషన్స్ వద్దు నా స్వశక్తితో నేనే ఉద్యోగం సంపాదించుకుంటాను అని అంటుంది దివ్య. అప్పుడు తులసి సంతోషపడుతూ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకుని స్థాయికి ఎదిగావు నీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను అని అంటుంది. నీ మనసుకు నచ్చిన పని నచ్చిన పద్ధతిలో చెయ్యి అని ఎంకరేజ్ చేస్తుంది తులసి. ఆ తర్వాత తులసి దివ్య బట్టలు సర్దుతూ ఉండగా ఇంతలో పరంధామయ్య వచ్చింది దివ్య ఎక్కడ అమ్మ అనడంతో అన్నయ్య వదిన మేనల్లుడుతో ఆడుకుంటోంది అని అంటుంది.
ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది మావయ్య పెద్ద కొడుకు వాళ్ళ అత్త మాటలు విని ఎక్కడ చెడిపోతాడు అనుకున్నాను అని అనగా అందరి మంచి కోరుకునే నీకు దేవుడు ఎలా చెడు చేస్తాడమ్మా అని అంటాడు. కానీ అభి అంకితలకు పిల్లలు లేరని బాధ మామయ్య అని అంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్లకి ఇంకా చాలా వయసు ఉంది అని అంటాడు పరంధామయ్య. పైగా వారిద్దరూ కూడా డాక్టర్లే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అని అంటాడు పరంధామయ్య. తర్వాత దివ్య ఒకటే నా బాధ్యత అని అనడంతో దివ్యకి కూడా పెళ్లి చేసేద్దామా అని అంటాడు పరంధామయ్య.
అప్పుడేనా అనగా మేము ముసలి వాళ్ళము ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అందుకే దివ్యకి పెళ్లి చేద్దాము అంటాడు. అప్పుడు పరంధామయ్య ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిది తులసి అని అంటాడు. ప్రస్తుతరోజుల్లో పిల్లలు వారి జీవితంలో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని అంటుంది. వీటన్నటికీ మించి విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల బిడ్డగా దివ్యకి ఒకరి మార్క్ ఉంటుంది. కాబట్టి దివ్యకు సంబంధం తేవడం అన్నది కష్టమైన పని. ఆ విషయం తలుచుకుంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది మావయ్య అని అంటుంది తులసి. అప్పుడు పరంధామయ్య సమస్య చూపించిన దేవుడే మార్గం కూడా చూపిస్తాడు కష్టం వచ్చిందని పారిపోం కదమ్మా అని తులసికి అర్థ అయ్యే
విధంగా ధైర్యం చెబుతూ ఉంటాడు.
అప్పుడు వారి మాటలు విన్న లాస్య నాకు మంచి అవకాశం దొరికింది ఎలా అయినా దివ్యని నా గుప్పెట్లో పెట్టుకొని తులసిని ఒక ఆట ఆడిస్తాను అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య ఇంటర్వ్యూ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలో పరందామయ్య వచ్చి ఆల్ ద బెస్ట్ దివ్య అని చెబుతాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వెళ్తున్న ఇంటర్వ్యూ ఇది కచ్చితంగా సెలెక్ట్ అవ్వాలి లైఫ్ లో ఫస్ట్ సెలెక్షన్ ఆల్వేస్ బెస్ట్ సెలక్షన్ అని దివ్య సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ దంపతులు కూడా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత తులసి అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ టైం అయింది వెళ్లి దేవుడికి దండం పెట్టుకోవడంతో తులసి కాళ్లకు దండం పెట్టి మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు అని అంటుంది దివ్య.
అప్పుడు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఎలా పేస్ చేయాలి అని తులసి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇంతలో నందు వాళ్లు అక్కడికి వచ్చి మేము కేఫ్ కి వెళ్తున్నాము రా దివ్య నేను ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాము అని అంటారు. అప్పుడు తులసి కూడా వెళ్లమని చెప్పగా నేను బైక్ లో వెళ్తున్నాను అని అంటుంది దివ్య. నాతో పాటు నువ్వు రావాలి అనడంతో నేను ఎందుకు అమ్మ అనడంతో నువ్వు నాతో పాటు ఉంటే కలిసొస్తుంది అన్న నమ్మకం అని అంటుంది దివ్య. నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే నాతోపాటు రావాల్సిందే అని అంటుంది దివ్య.
అప్పుడు దివ్య వెళ్లి నందు కాళ్లకు దండం పెట్టగా లాస్య కూడా తన కాళ్లకు దండం పెడుతుంది అనుకోగా లాస్యని దివ్య పట్టించుకోకపోవడంతో కుళ్ళుకుంటూ ఉంటుంది లాస్య. ఆ తర్వాత దివ్య, తులసి ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. అప్పుడు దివ్య తులసి ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు తులసికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ ఎండి వచ్చిన కూడా దివ్య పట్టించుకోకుండా కాలు మీద కాలు వేసుకుని మొబైల్ ఫోన్ చూస్తూ ఉండగా అది చూసి ఆమె కోపంగా లోపలికి వెళ్తుంది. ఇంతలోనే ఒక అతను వచ్చి ఈ హాస్పిటల్ ఎండి గారు వచ్చారు నువ్వు కాలు మీద కాలు వేసుకునే సరికి అలా కోపంగా చూసి వెళ్లిపోయారు అనడంతో దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత రాజ్యలక్ష్మి ఈ మంత్ నుంచి మీకు చాలు తగ్గిద్దామనుకుంటున్నాను అని డాక్టర్స్ తో అనడంతో అదేంటి మేడం అనగా మరి నేను ఈ బిజినెస్ పెట్టింది డబ్బు కోసం అలాంటిది ప్రతినెలా డబ్బు తక్కువగానే వస్తోంది అసలు రీజన్ ఏంటి చెప్పండి అనడంతో మన హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల పేషెంట్స్ ఎవరూ సరిగా రావడం లేదు. ఒకసారి వచ్చిన పేషెంట్స్ తర్వాత మళ్ళీ రావడం లేదు అని చెప్పడంతో ఓకే అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి కొడుకు మనం హాస్పటల్లో దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళ మన నమ్మకం పేషెంట్స్ కి కలిగించాలి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేయాలి మన హస్తవాసి మంచిది అన్న ఒపీనియన్ వాళ్ళలో కలిగేలా చేయాలి అని అంటాడు.
బ్రతుకు మీద తీపి ఉంటే మళ్ళీ ఈ హాస్పిటల్ కి రావాలి అని అనిపించేలా చేయాలి అనడంతో అక్కడున్న డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు రాజ్యలక్ష్మి చావు బతుకుల మధ్య ఉన్నారు అంటే ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారు ఆ సమయంలో ఇంకా డబ్బులు ఎక్కువగా లాగాలి. అవసరం ఉన్న లేకపోయినా ఎక్కువగా టెస్టులు రాసి బిల్లులు లక్షలకు లక్షలు వేలకు వేలు రాయాలి అని అంటుంది. ఇప్పటినుంచి మీరు అదే పనిలో ఉండాలి అనడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సంజయ్ అక్కడ ఒక నర్స్ ని అదోలా చూస్తూ కొత్త రిక్యూట్ లా ఉందే అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు.
ఇంతలోనే ఒకతను అక్కడికి వచ్చి ఒక అమ్మాయి ఇంటర్వ్యూకు వచ్చింది అనడంతో మీరు ఇంటర్వ్యూ చేయండి నేను వీడియోలో మానిటర్ చేస్తాను అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు తులసి దివ్య మనం వచ్చి చాలా సేపు అయింది అనడంతో మనల్ని పిలవరేమో అని నా అనుమానం మమ్మీ అంటుంది. ఎందుకు దివ్య అనగా ఇందాక నా ముందు హాస్పిటల్ ఏమిటి వెళ్లారు నేను విష్ చేయలేదు మరి కోపం వచ్చి ఉంటుంది కదా మమ్మీ అని అంటుంది. ఇంతలోనే నర్స్ అక్కడికి వచ్చి ఇంటర్వ్యూకి రమ్మని చెబుతున్నారు అనడంతో దివ్య లోపలికి వెళ్తుంది. అప్పుడు దివ్య ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు మంచిగా సమాధానం లో చెప్పడంతో అది చూసి రాజ్యలక్ష్మి పర్లేదు డిగ్నిఫైడ్ గానే సమాధానం చెబుతోంది అని అనుకుంటూ ఉంటుంది. వెరీ గుడ్ అని అనుకుంటూ ఉంటుంది.
