Asianet News TeluguAsianet News Telugu

నాని, నితిన్, నాగ చైతన్య.. ఆ ఒప్పందం ఏంటి ?

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. భారీ బడ్జెట్ చిత్రాలు అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న హీరోల చిత్రాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.

Tuck Jagadish, mastro, Love story producers comes with agreement
Author
Hyderabad, First Published Aug 25, 2021, 9:09 PM IST

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. భారీ బడ్జెట్ చిత్రాలు అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న హీరోల చిత్రాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. చివరకు విక్టరీ వెంకటేష్ నారప్ప కూడా ఓటిటిలో రిలీజ్ అయిందంటే థియేటర్స్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఇక నేచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ చిత్రం కూడా ఓటిటిలోనే విడుదలవుతోంది. టక్ జగదీశ్ చిత్ర ఓటిటి రిలీజ్ డేట్.. నాగ చైతన్య లవ్ స్టోరీ థియేటర్ రిలీజ్ డేట్ క్లాష్ కావడంతో ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతూ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. నానిపై ఆరోపణలు కూడా చేశారు. 

అదే సమయంలో నితిన్ 'మ్యాస్ట్రో' మూవీ కూడా ఓటిటిలోనే విడుదలవుతోంది. ఇది లవ్ స్టోరీ చిత్ర నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షాక్ ఇచ్చే అంశం. దీనితో మూడు చిత్రాల నిర్మాతలు కలసి కూర్చుని ఒప్పందానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ఉండేందుకు వారి వారి చిత్రాలను కొన్ని రోజుల విరామం తర్వాత విడుదల చేసుకునేలా చర్చించుకున్నారట. లవ్ స్టోరీ చిత్రం ముందుగా అనుకున్న రోజునే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. 

లవ్ స్టోరీ విడుదలైన వారం తర్వాత నాని టక్ జగదీశ్ మూవీ అమెజాన్ లో, మరో రెండు రోజుల తర్వాత నితిన్ మాస్ట్రో మూవీ హాట్ స్టార్ లో విడుదలయ్యేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం నిర్మాతలు తమ చిత్రాల విడుదలను పోస్ట్ పోన్ చేసేలా ఓటిటి సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios