Asianet News TeluguAsianet News Telugu

మైండ్ బ్లాక్: ‘టక్ జగదీష్’ టోటల్ బిజినెస్ ఫిగర్


'టక్ జగదీష్' చిత్రం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాని 'వి' సినిమాని ఓటీటీలో విడుదల చేయగా.. ఈసారి ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తారని భావించారు. 

Tuck Jagadish closes massive 51 Cr business
Author
Hyderabad, First Published Aug 6, 2021, 7:27 AM IST

  నాని 25వ సినిమా ‘వి’ గతేడాది ఓటిటిలోనే విడుదలైంది. ఇప్పుడు నాని నటించిన టక్ జగదీష్ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాలని చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమేజాన్ ప్రైమ్ తో ఎగ్రిమెంట్ అయ్యిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు దాదాపు రూ.37 కోట్ల వ‌ర‌కు డీల్ జ‌రిగింద‌ని ట్రేడ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే  ఇప్పుడు ఉన్న  కరోనా సిట్యువేషన్ లో ఈ  సినిమా ఒక‌వేళ థియేట‌ర్ల‌లో విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా 37 కోట్లు వ‌సూలు చేయ‌డం కష్టమే. అందుకే నిర్మాత‌లు ఓటీటీకి ఓకే చెప్పిన‌ట్లు సమాచారం. అయితే  ఆ 37 కోట్లు కూడా కేవ‌లం ఓటీటీకి మాత్ర‌మే. అందులో డిజిట‌ల్‌, డ‌బ్బింగ్‌, శాటిలైట్ రైట్స్ లేవు. మరి వాటికెంత వచ్చిందీ అంటే..ఆ డిటేల్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి.

ఆ వివరాల్లోకి వెళితే... నాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఎప్పుడో పూర్తైన ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రారంభం రోజు నుంచి మంచి ఎక్సపెక్టేషన్స్  సెట్ చేసుకున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనటంలోనూ సందేహం లేదు. ఇప్పటికే  ఈ సినిమా పోస్టర్స్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్స్‌ వచ్చేసి ఆదరణ చూరగొన్నాయి. ఈ చిత్రం బిజినెస్ వివరాలు..ఇలా ఉన్నాయి.

డైరక్ట్ ఓటీటి (అమేజాన్) – రూ 37 కోట్లు
శాటిలైట్ (స్టార్ మా) – రూ 7.50 కోట్లు
ఆడియో (ఆదిత్యా మ్యూజిక్) – రూ 2 కోట్లు
హిందీ డబ్బింగ్ – రూ 5 కోట్లు
మొత్తం బిజినెస్ – రూ 51.5 కోట్లు

ఇక ఈ సినిమానకు థమన్ సంగీతం అందిస్తుండగా సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు.  ఇక ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కళ: సాహి సురేష్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Follow Us:
Download App:
  • android
  • ios