బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో రెండు సీజన్ లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. జూన్ లేదా జూలై నెలలో షో మొదలుకానుంది. అయితే దీనికి హోస్ట్ గా ఎన్టీఆర్ కన్ఫర్మ్ అయ్యాడని, ఇరవై కోట్ల రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి.

రాజమౌళి సినిమా ఉండడంతో ఎన్టీఆర్  హోస్ట్ గా చేస్తాడా..? అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ రాజమౌళి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో ఆ వెసులుబాటు  కల్పిస్తాడని అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బిగ్ బాస్ షోని హోస్ట్ చేసే అవకాశం లేదని అంటున్నారు.. 

దీంతో ఇప్పుడు మాటీవీ యాజమాన్యం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాజమౌళి 'RRR'సినిమాకి రెండు వందల రోజుల కాల్షీట్స్ కావాలి. ఇప్పటివరకు పాతిక కాల్షీట్స్ కూడా అవ్వలేదని సమాచారం. ఇంకా చాలా రోజులు షూటింగ్ చేయాల్సివుంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ షో చేయడం కుదరదని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని మాటీవీ జనాలకు కూడా చెప్పారట. కానీ వాళ్లు మాత్రం ఎలాగైనా.. ఎన్టీఆర్ ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారట. కానీ అది కష్టమేనని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.