అధ్యక్ష పీఠం ఎక్కిన తరువాత ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా  కదిలిస్తూ సుంకాలు వేస్తున్న డోనాల్డ్ ట్రప్.. తాజాగా సినిమా రంగంపై కూడా పడ్డాడు. అమెరికా సినిమాకు అన్యయం జరుగుతుందంటూనే.. 100 శాంతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటన చేశాడు. అయితే ఈ ప్రకటనతో  ఇండియన్ సినిమాలకు, మరీ ముఖ్యంగా టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల పై ప్రభావం ఎంత? 

టారీఫ్ బాంబులతో మోత మోగిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాలతో పాటు అమెరికా ప్రజలను కూడా సుంకాలతో భయపెడుతున్నాడు.  ఇప్పటికే టారీఫ్ వార్ తో పలు రంగాలను కుదిపేసిన ఆయన.. ఇక సినిమా రంగంపై కూడా ఆ బాంబ్ విసిరారు.  అమెరికాలో రిలీజ్ అయ్యే సినిమాలపై 100 పన్ను విధిస్తున్నట్టు తాజాగా ప్రకటన విడుదల  చేశాడు ట్రంప్. తమ సినిమాలకు అన్యాయం జరుగుతుందని, హాలీవుడ్ ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ ట్రప్ ఆవేదన వ్యాక్తం చేశారు. ఈమేరకు ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు. 

అమెరికా సినీపరిశ్రమ చాలా స్పీడ్ గా పతనం అవుతోంది. హాలీవుడ్ ను అమెరికాకు దూరం చేసేందుకు చాలా దేశాలు రాయితీలు ఇస్తున్నారు. వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలను కూడా టార్గెట్ చేశారు. తమ దేశంపే ఈ రకంగా ఇతర దేశాలు సమిస్టిగా కుట్ర చేస్తున్నట్టు ట్రంప్ అనుమానం వ్యాక్తం చేశారు.  ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నట్టు  ట్రంప్ వెల్లడించారు. 

ఇతర దేశాల్లో షూటింగ్ చేసుకుని తమ దేశంలో రిలీజ్ అయ్యే సినిమాలకు 100 శాతం పన్ను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటన చేశారు. ఈ రకంగా వాణిజ్య పన్నుల శాఖకు ఆదేశాలు కూడా ఇచ్చినట్టు ఆయన తెలిపారు.  అయితే ట్రంప్ నిర్ణయంతో  ఇండియన్ సినిమాపై..ముఖ్యంగా తెలుగు నుంచి విడుదల కాబోతున్నపాన్ ఇండియా సినిమాలపై, ఈ ప్రభావం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కాని ఇక్కడ కొన్ని విషయాలలో క్లారిటీ రావాల్సి ఉంది. 

ట్రంప్ విధించిన టారీఫ్ లు ఏ సినిమాలకు వర్తిస్తాయి అనే విషయంలో కన్ ఫ్యూజన్ నెలకొంది. విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న తమ సినిమాలపై ఈ టారీఫ్ లు పనిచేస్తాయా.. లేక విదేశాల నుంచి అమెరికాలో రిలీజ్ అయ్యే సినిమాలపై సుంకాలు వేశారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంలో అమెరికా వాణిజ్య విభాగం నుంచి త్వరలో అన్ని విషయాలతో ప్రకటన వస్తుందని అధికారులు తెలిపారు. అంతే కాదు విదేశీ సినిమాలపై ఈ టారీఫ్ పడితే.. మన సినిమాలకు ఇబ్బందులు తప్పవని చెప్పాలి.  

ఈ మధ్యనే ఓవర్ సిస్ లో మన సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిని అందుకుంటున్నాయి. ఈక్రమంలో ఈ టారీఫ్  ప్రభావం వాటిపై పడే అవకాశం ఉంది. ఈ కారణంతో ఓవర్ సిస్ లో  టికెట్ రేట్లు పెంచడం లాంటివి చేస్తే, కలెక్షన్ల పతనానికి అది కారణం అవ్వచ్చనే అభిప్రాయం వెల్లడిఅవుతుంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి.  అయితే సినిమాను వస్తువుగా కాకుండా మేధో సంపదగా పరిగణించి వాటిపై కొన్ని ప్రాంతాల్లో సుంకాలు విధండం లేదు. కాని రీసెంట్ గా హాలీవుడ్ నుంచి కొన్ని స్టార్ ప్రొడక్షన్ హౌస్ లు విదేశాలు తరలి వెళ్లడంతో ట్రంప్ దీనిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది టారీఫ్ లు విధించడానికి కూడా అదే కారణంగా తెలుస్తోంది.