Siddharth comments: సైనా నెహ్వాల్ పై హీరో సిద్దార్థ్ డబుల్ మీనింగ్ ట్వీట్.. మహిళా కమిషన్ కేసు నమోదు
సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పే నటుడు సిద్దార్థ్. సినీ రాజకీయ అంశాల గురించి సిద్దార్థ్ తరచుగా ట్విట్టర్ లో స్పందించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపుతోంది.
సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పే నటుడు సిద్దార్థ్. సినీ రాజకీయ అంశాల గురించి సిద్దార్థ్ తరచుగా ట్విట్టర్ లో స్పందించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపుతోంది. సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ తో సిద్దార్థ్ చిక్కుల్లో పడ్డాడు.
ఇటీవల ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించినప్పుడు.. నిరసన కారుల ఆందోళన నేపథ్యంలో మోడీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోవాల్సి వచ్చింది. దేశ ప్రధాని పర్యటిస్తున్న చోట సెక్యూరిటీ లోపాలు తలెత్తడం ఏంటి అంటూ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ సంఘటనపై చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందించారు.
బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఈ చర్యని ఖండించిది. దేశ ప్రధానికి సెక్యూరిటీ లేని ఏ దేశం కూడా సేఫ్ అని చెప్పలేం.ప్రధాని మోడీ పర్యటించినప్పుడు నిరసన చర్యలని, భద్రత లోపాల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సైనా నెహ్వాల్ ట్విట్టర్ లో పేర్కొంది. సైనా ట్వీట్ పై స్పందిస్తూ సిద్ధార్థ్ డబుల్ మీనింగ్ తో కొన్ని కామెంట్స్ చేశాడు.
'దేశానికి సంరక్షకులుగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ సైనాపై Subtle అనే పదాలు ఉపయోగించాడు సిద్ధార్థ్. ఇది కాస్త తీవ్రమైన విమర్శలకు కారణం అయింది. సిద్దార్థ్ అసభ్యకరమైన పదాలు ఉపయోగిస్తూ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేసాడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల్ని కించపరిచేలా, సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర కామెంట్స్ చేసిన సిద్దార్థ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విచారణ కోసం మహిళా కమిషన్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. అలాగే సిద్ధార్థ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదుకు కూడా ఆదేశించారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతుండగా.. సిద్ధార్థ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన కామెంట్స్ ని తప్పుగా ఆలోచిస్తే అలాగే అర్థం అవుతాయి అని.. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని సిధ్దార్త్ పేర్కొన్నారు.