సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు పాతిక కోట్ల షేర్ సాధించింది. 

దీంతో చిత్రయూనిట్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగితేలుతున్నారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేష్ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. ఈ సందర్భంగా తీసిన ఫోటోని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ''సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ మూవీ మహర్షి.. ఇంతటి బ్లాక్ బస్టర్ ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు.. వాట్ ఏ నైట్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

దీంతో మహేష్ అభిమానులు మంచి సందేశాత్మక చిత్రమని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఓ నెటిజన్ మాత్రం 'నమ్రత నువ్వెందుకు మేకప్ వేసుకోవు.. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా.. లేదా డిప్రెషన్ లో ఉన్నావా' అంటూ ట్రోల్ చేశాడు.

ఇది చూసిన నమ్రత... 'నీలాంటి వాళ్లకు మేకప్ వేసుకున్న మహిళలంటేనే ఇష్టమానుకుంటా.. ఇకపై నీ ఆలోచనలకు సరిపోయేవాళ్లనే ఫాలో అవ్వు.. అలా అయితే ఇలాంటివి చూడాల్సిన అవసరముండదు.. కాబట్టి నువ్వు నన్ను అన్ ఫాలో చెయ్.. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్..'' అంటూ కౌంటర్ ఇచ్చింది.

నమ్రత సమాధానం విన్న అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు.. మంచి కౌంటర్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.