సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదల రోజు ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. రేటింగ్స్ కూడా పెద్దగా రాలేదు కానీ రైతుల కాన్సెప్ట్ కావడంతో ఎవరూ నెగెటివ్ కామెంట్స్ చేయలేకపోయారు. 

అయితే సినిమా హిట్ అని అనిపించుకోవడానికి చిత్రబృందం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసింది. మహేష్ బాబు స్వయంగా రంగంలోకి ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఎన్నడూ లేని విధంగా థియేటర్ విజిట్స్ కూడా చేశాడు. కాలర్ ఎగరేసి మరీ అభిమానుల్లో జోష్ నింపాడు.

అంతేకాదు.. 'మహర్షి' సక్సెస్ మీట్ తరువాత వరుసగా ట్వీట్ లు పెట్టడం మొదలుపెట్టాడు. దర్శకుడు వంశీ పైడిపల్లిని పొగుడుతూ వరుసగా ట్వీట్ లు పెడుతూనే ఉన్నాడు. దీంతో ఒక వర్గపు ఆడియన్స్ కి విసుగు వచ్చేసింది. దీంతో వారు మహేష్ పైసెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

'మహర్షి సినిమా సక్సెస్ అని ఒప్పుకుంటున్నాం.. ఇక వదిలేయ్ బాబు' అంటూ రివర్స్ లో పంచ్ లు వేస్తున్నారు. ప్రమోషన్స్ ఎక్కువ అవ్వడం కూడా ఇలా నెగెటివ్ కామెంట్స్ కి కారణమని కొందరు అంటున్నారు. టీం అతిని భరించలేకపోతున్న కొందరు ఆడియన్స్ కి సోషల్ మీడియాలో కూడా అవే ట్వీట్లు చూసి చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే మహేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.