ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అందరూ కూడా చంద్రబాబు గెలుస్తాడా..? లేక జగనా..? అని చర్చించుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో ఫలితాలు రానున్న క్రమంలో ఏపీలో ఉత్కంఠ నెలకొంది.

ఎవరికివారే మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ ప్రస్తావన మాత్రం పెద్దగా రావడం లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఆయన సీఎం అవుతాడా..? అనే విషయాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ కమెడియన్ ధనరాజ్ మాత్రం పవన్ సీఎం అవుతాడని జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 

''బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి,  శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు'' అంటూ పరోక్షంగా పవన్ పార్టీకి 125 నుండి 140 సీట్లు వస్తాయని ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

ఇది చూసిన నెటిజన్లు ధనరాజ్ ఫై జోకులు వేసుకుంటున్నారు.అసలు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయో తెలుసా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొందరు మీమ్స్ చేస్తూ ధనరాజ్ చేసిన కామెడీకి మార్కులు ఇస్తున్నారు. వెంటనే తను పెట్టిన పోస్ట్ ని డిలీట్ చేశాడు ధనరాజ్.