బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ గతంలో రణబీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరికీ బ్రేకప్ అవ్వడం, దీపికా రణవీర్ సింగ్ ని ప్రేమించడం జరిగిపోయాయి. త్వరలోనే దీపికా, రణవీర్ లు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. ఇటువంటి సమయంలో దీపికా తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఫోటోని షేర్ చేసింది.

నిన్న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దీపికా.. రణబీర్ కపూర్ తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. 2015లో 'తమాషా' షూటింగ్ సందర్భంగా క్రొయేషియాలో రణబీర్ తో కలిసి ఓ ఫోటో దిగింది. ఆ ఫోటీని షేర్ చేయగా అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నీ మనసులో ఇంకా రణబీర్ ఉంటే మరొకరితో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావ్' అంటూ దీపికాపై ఫైర్ అయ్యారు. 'నీ గతాన్ని ఇలా షేర్ చేస్తే నీ జీవితం కూడా తమాషా అవుతుంది','నువ్వు త్వరగా మానసిక నిపుణుడిని కలిస్తే మంచిది' ఇలా రకరకాలుగా ఆమెపై విమర్శలు గుప్పించారు. దీపికా, రణబీర్ లు విడిపోయినప్పటికీ స్నేహితులుగా ఉంటున్నారు. బ్రేకప్ తరువాత కూడా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. 

 

Capturing Moments 📸📸 #WorldPhotographyDay

A post shared by Deepika Padukone (@deepikapadukone) on Aug 19, 2018 at 1:16am PDT