కియారా అద్వానీ నార్త్ లో ఇటీవల బాగా క్రేజ్ తెచ్చుకున్న నటి. తన అందాలతో కుర్రకారుని మాయ చేస్తోంది. కియారా టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను, రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. 

ఇక కియారా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. గ్లామర్ ఫోజుల్లో ఫోటో షూట్స్ చేస్తూ మతి పోగొడుతోంది. తాజాగా కియారా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ పిక్ వైరల్ అవుతోంది. హాట్ నెస్ తో కియారా అదరగొడుతోంది. 

కానీ కియారా వేసుకున్న ఎల్లో డ్రెస్ పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. కియారా వేసుకున్న ఎల్లో గౌను డిఫరెంట్ లుక్ లో మ్యాగీ న్యూడిల్స్ ని తలపించే విధంగా ఉంది. దీనితో నెటిజన్లు కియారా ఒంటిమీద ఉన్నది డ్రెస్సా.. మ్యాగీ న్యూడిల్సా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

'మ్యాగీ న్యూడిల్స్ ని అమితంగా ఇష్టపడేవారు ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటారు.. మీరు ఇంట్లో మ్యాగీ న్యూడిల్స్ ఎక్కువైతే వేస్ట్ చేయకండి.. ఇలాంటి డ్రెస్ చేయించుకోండి అంటూ వివిధ రకాలుగా నెటిజన్లు కియారా డ్రెస్ పై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🌼

A post shared by KIARA (@kiaraaliaadvani) on Sep 3, 2019 at 7:58am PDT