పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది. యూఎస్, బ్రిటన్ దేశాల్లో కూడా పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
భీమ్లా నాయక్ మూవీ రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. దీనితో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ కి త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర, సంయుక్త మీనన్, తమన్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు హాజరయ్యారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు తనకు ఎదురైన పెద్ద సమస్యని రివీల్ చేశారు. అయ్యప్పనుమ్ కోషియం చిత్రం కోషి కోణంలో ఉంటుంది. అదే పాత్రని డానీగా రానా పోషించారు. దీనిని భీమ్లా కోణంలోకి మార్చాలి. అదే మాకు ఎదురైన పెద్ద ఛాలెంజ్.
కో కాబట్టి రీమేక్ చేస్తున్నాం అని భావించకుండా ఆ కథ నుంచి బయటకు వచ్చి ఆలోచించాం. అడవి నేపథ్యం తీసుకుని కథ మొదలు పెట్టాం అని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ని ఎలివేట్ చేయాలంటే సీన్స్ ఆర్టిఫీషియల్ గా ఉండకూడదు. బ్యాలెన్సింగ్ గా ఉండాలి. అందుకు కృషి చేసాం.
ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. 80 దశకం నటులకంటే ఇప్పటి జనరేషన్ నటులు సినిమాని, అన్ని విభాగాలని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు అని అన్నారు. అలాగే దర్శకుడు సాగర్ కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చినట్లు తెలిపారు.
ఇక భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ కొత్తగా ఉండాలని భావించాం. ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో సాగర్ మొగిలయ్య పేరు చెప్పారు. ఆ తరహాలో ఏదైనా చేద్దాం అని అనుకుంటున్నప్పుడు.. ఎవరో ఎందుకు మొగిలయ్యనే పిలిపించండి పాడిద్దాం అని చెప్పాను. ఆ తర్వాత మొగిలయ్యకు పద్మశ్రీ రావడంతో చాలా సంతోషించాం అని అన్నారు.
ఇక కోవిడ్ సమయంలో షూట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రానా తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు. మాకు మాస్క్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ నటీనటులకు మాస్క్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. దీనితో పవన్, రానా ఇద్దరూ మాస్క్ లేకుండా జనాల్లోకి వెళ్లిపోయారు.
ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య తమన్ సంగీతం తో మాట్లాడుతున్నాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత బాగా వచ్చింది అంటే అదే కారణం అని త్రివిక్రమ్ ప్రశంసించారు.
