దర్శకుడు త్రివిక్రమ్ తన షూటింగ్ స్టైల్ ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదేదో కొత్త పద్ధతి కాదు.. దర్శకుడు రాజమౌళి అనుసరిస్తోన్న పద్ధతినే త్రివిక్రమ్ కూడా ఫాలో అవుతున్నాడు. రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తారు కాబట్టి ఆయన షూటింగ్ కి ముందుగా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. 

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. రాజమౌళి వర్క్ షాప్స్ కి అటెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తన సినిమాల విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. మూడు, నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని.. ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు చేసి రిహార్సల్స్ చేయిస్తున్నారట.

రిహార్సల్స్ అయిన మరుసటి రోజు నుండి మూడు, నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. మళ్లీ రిహార్సల్స్ చేయించి.. షూటింగ్ కి వెళ్లడం ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. అల్లు అర్జున్ కూడా ఈ రిహార్సల్స్ కి హాజరవుతున్నాడు.

కాబట్టి మిగిలిన ఆర్టిస్ట్ ల గురించి చెప్పనక్కర్లేదు. ఈ విధంగా చేయడం ద్వారా మంచి అవుట్ పుట్ రావడంతో పాటు సమయం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుండగా.. నివేతా పేతురాజ్, సుశాంత్ లు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.