Asianet News TeluguAsianet News Telugu

శర్వా గురించి ఎన్టీఆర్ ని అడిగాడట, ఏమంటాడో

కుర్చీల ఆట లాగ హీరోలు డేట్స్ చుట్టూ డైరక్టర్స్, స్టార్ డైరక్టర్స్ కోసం హీరోలు తిరుగుతూనే ఉంటారు. ఒకరు ఖాళీ అయితే మరకొరు కూర్చుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్దితి అలానే ఉందంటున్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న  ప్రాజెక్టు కరోనా దెబ్బతో వెనక్కి వెళ్లింది. ఎప్పుడు రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ అవుతుందో..ఎప్పుడు తన వంతు వస్తుందో తెలియని సిట్యువేషన్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ ఆరు నెలలు లేటు అవ్వచ్చు అంటున్నారు. ఈ ఆరు నెలలూ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం కన్నా మరో హీరోతో ముందుకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Trivikram is keen on working with Sharwanand
Author
Hyderabad, First Published Jun 9, 2020, 8:01 AM IST

ఇండస్ట్రీలో ఒకరి ప్రాజెక్టు మీద మరొకరు డిపెండ్ అవుతూంటారు. ఎందుకంటే కుర్చీల ఆట లాగ హీరోలు డేట్స్ చుట్టూ డైరక్టర్స్, స్టార్ డైరక్టర్స్ కోసం హీరోలు తిరుగుతూనే ఉంటారు. ఒకరు ఖాళీ అయితే మరకొరు కూర్చుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్దితి అలానే ఉందంటున్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న  ప్రాజెక్టు కరోనా దెబ్బతో వెనక్కి వెళ్లింది. ఎప్పుడు రాజమౌళితో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫినిష్ అవుతుందో..ఎప్పుడు తన వంతు వస్తుందో తెలియని సిట్యువేషన్. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ ఆరు నెలలు లేటు అవ్వచ్చు అంటున్నారు. ఈ ఆరు నెలలూ ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం కన్నా మరో హీరోతో ముందుకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో అ..ఆ లాంటి ఓ చిన్న ఫ్యామిలీ సబ్జెక్టుని త్రివిక్రమ్ రెడీ చేసారట. నాని,నాగచైతన్య లతో అనుకున్నా..ఇధ్దరూ బిజీగా ఉన్నారు. దాంతో శర్వాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. అయితే అందుకు ఎన్టీఆర్ ఫర్మిషన్ కావాలి. ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నా..అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోవాలి. ఇదే విషయమై ఎన్టీఆర్ దగ్గర ప్రపోజల్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇంకా ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. వస్తే కనుక శర్వా డేట్స్ ని బట్టి ఎప్పటి నుంచి షూటింగ్ పెట్టుకోవచ్చు అనే ప్లానింగ్ త్రివిక్రమ్ చేస్తారట. ఎప్పటినుంచో త్రివిక్రమ్ తో చేయాలనేది శర్వా కోరికట. దాంతో తను రెడీగానే ఉన్నాను..మీరు ఎన్టీఆర్ ని ఒప్పించుకోవటమే ఆలస్యం అన్నట్లు శర్వా చెప్పారట. అయితే ఇదంతా ట అనే ధోరణిలోనే ఉంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందీ అనేది తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. 
 
ఇక  త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ తో కల్యాణ్ రామ్ -  చినబాబు కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే  త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి,ఎన్టీఆర్ డిస్కస్ చేస్తూ ఫైనల్ చేసే పనిలో వున్నాడు. అయితే లాక్ డౌన్ అయిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజమౌళితో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు ఇంకా బాలెన్స్ వుంది. ఆ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ తన లుక్ ను కంటిన్యూ చేయవలసే ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios