త్రివిక్రమ్...ఏ ఎండకా గొడుగు స్కీమ్ సూపర్

త్రివిక్రమ్ ఎవరితో పడితే వారితో సినిమా చేయలేరు కదా. కొత్తవారితో చేస్తే ఆ స్దాయి బిజినెస్ కాదు. తనను తాను తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాగని స్టార్స్ తో ముందుకు వెళ్దామంటే వాళ్లంతా కమిటైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా వచ్చే మార్చి లేదా ఏప్రియల్ లో గానీ మొదలు కాదు. ఈ క్రమంలో మీడియం రేంజి సినిమా చేస్తాడని అందరూ భావించారు. రామ్, నాని వంటి హీరోలతో ముందుకు వెల్తాడనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ ప్రక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Trivikram drops off other hero plans jsp

త్రివిక్రమ్ వంటి స్టార్ డైరక్టర్ ఖాళీగా ఉండటం అంటే వింతే. అయితే కరోనా అందరినీ ప్రక్కకు నెట్టేసింది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్నాయి. కానీ హీరోలు డేట్స్ కావాలి. త్రివిక్రమ్ ఎవరితో పడితే వారితో సినిమా చేయలేరు కదా. కొత్తవారితో చేస్తే ఆ స్దాయి బిజినెస్ కాదు. తనను తాను తగ్గించుకోవాల్సి వస్తుంది. అలాగని స్టార్స్ తో ముందుకు వెళ్దామంటే వాళ్లంతా కమిటైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తో అనుకున్న సినిమా వచ్చే మార్చి లేదా ఏప్రియల్ లో గానీ మొదలు కాదు. ఈ క్రమంలో మీడియం రేంజి సినిమా చేస్తాడని అందరూ భావించారు. రామ్, నాని వంటి హీరోలతో ముందుకు వెల్తాడనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ ప్రక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటి పరిస్దితులను బట్టి..అప్పుడు మార్చుకుంటూ త్రివిక్రమ్ ముందుకు వెళ్లటమే కలిసొస్తోంది. అంతేకానీ ఒకేదాన్ని పట్టుకుని వేళ్లాడితే ఫలితం జీరో అవుతుంది. చాలా మంది సీనియర్ డైరక్టర్స్ లాగ వెనకబడిపోతాడు.

పిబ్రవరి నుంచి ఎలాగో ఎన్టీఆర్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంబిస్తాం కదా. ఈ లోగా సినిమా తీసి రిలీజ్ చేయటం కష్టం అనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందులోనూ అలవైకుంఠపురం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చేసే సినిమాకు వచ్చే క్రేజ్ వేరు. మధ్యలో వేరే సినిమా చేసి మళ్లీ ఎన్టీఆర్ దగ్గరకు వస్తే...క్రేజ్ తగ్గుతుంది. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఆ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్..రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ లో స్టక్ అయ్యారు. పిబ్రవరి నుంచి తాను ఫ్రీ అవుతానని త్రివిక్రమ్ కు చెప్పినట్లు సమాచారం. 

ఎన్టీఆర్​, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బ్లాక్‌బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఆ తరహాలోనే యాక్షన్ తో కూడిన సినిమా అని తెలుస్తోంది. అయితే ఈ సారి ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రకటించి దాదాపుగా ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యింది.  ఈ చిత్రానికి ఎన్టీఆర్​ సోదరుడు కల్యాణ్​ రామ్‌​తో కలిసి హారికా, హాసిని క్రియేషన్స్​ బ్యానర్​​ సంయుక్తంగా నిర్మించనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios