అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమా బాలీవుడ్ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ బాలీవుడ్ సినిమా రైట్స్ తీసుకోవడంతో అదే కథతో బన్నీతో సినిమా చేస్తారని అనుకున్నారు.

కానీ త్రివిక్రమ్ మాత్రం కొత్త కథ రాసుకున్నాడట. ఈ కథ మొత్తం 'అబద్ధం' చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కథలో హీరో అనుకోకుండా ఓ అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి సినిమా అంతా ప్రయత్నిస్తూనే ఉంటాడు.

చివరికి ఆ అబద్ధమే నిజమవుతుంది. ఆ ప్రయాణంలో హీరో పడిన పాట్లతో త్రివిక్రమ్ సినిమా తీస్తున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమాలు చూస్తే గనుక ఆయన మార్క్ కామెడీ మిస్ అయిందనే చెప్పాలి.

అయితే ఈసారి మాత్రం తన కథలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున సినిమాను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం.