ఇండియన్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా కోసం మద్రాస్ టాకీస్ - లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా 800కోట్ల పెట్టుబడితో సినిమాను రెండు భాగాలుగా నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. 

అయితే ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ లో ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు సీనియర్ బ్యూటీ త్రిష కూడా ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కథను విన్న త్రిష సింగిల్ సిట్టింగ్ లో ప్రాజెక్ట్ ని ఒకే చేసినట్లు సమాచారం. కార్తీ - జయం రవి - నయనతార - అమితాబ్ బచ్చన్ - ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్ తో పాటు సత్యరాజ్ - జయరామ్ - అమలాపాల్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించడానికి ఒప్పుకున్నారు. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నం సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమవుతున్నారు. కుదిరితే ఏడాది చివరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానునున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాలో నటించే తారాగణంపై లైకా ప్రొడక్షన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.