త్రిష క్యూట్‌ పెట్‌ డాగ్స్ తో కనిపించడం విశేషం. షూటింగ్‌ బ్రేక్‌లో త్రిష్‌ ఇలా సెట్‌లో కుక్క పిల్లలతో కనిపించింది. 

స్టార్‌ హీరోయిన్‌ త్రిష(Trisha).. చిత్ర పరిశ్రమలో తనది సెపరేట్‌ స్టయిల్‌. సెపరేట్‌ ఇమేజ్‌ కూడా. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడిని చెప్పలేం. కానీ రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు కూడా చేసింది. అయితే అందులోనూ తన పాత్రకి ప్రయారిటీ ఉండేలా చూసుకుంది. తెలుగులో టాప్‌ స్టార్స్ అందరితోనూ ఓ రౌండ్‌ నటించి మెప్పించిన ఈ బ్యూటీ చాలా కాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయం చెందడంతో ఇప్పుడు తమిళం, మలయాళంకే పరిమితమయ్యింది. 

ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌తో తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది త్రిష్‌. స్టార్‌ హీరోయిన్లంతా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్న నేపథ్యంలో త్రిష కూడా డిజిటర్‌ రంగంలో తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యింది. అందులో భాగంగా `బృంద` అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో త్రిష పోలీస్‌ అధికారిగా కనిపించబోతుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోని చూస్తుంటే ఆ విషయం అర్థమవుతుంది. 

Scroll to load tweet…

ఇదిలా ఇందులో త్రిష క్యూట్‌ పెట్‌ డాగ్స్ తో కనిపించడం విశేషం. షూటింగ్‌ బ్రేక్‌లో త్రిష్‌ ఇలా సెట్‌లో కుక్క పిల్లలతో కనిపించింది. ఎంతో క్యూట్‌గా ఉన్న వాటిని దగ్గరికి చేర్చుకుని సరదాగా ఆడుకుంటుండగా తీసిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది త్రిష. చిన్న కుక్క పిల్లలతో సైడ్‌కి ఇలా అంటూ త్రిష ఆయా ఫోటోని పంచుకోగా అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. 

త్రిష నటిస్తున్న `బృంద` వెబ్‌ సిరీస్‌కి సూర్య వంగాల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ని ఇతర భాషల్లోనూ అనువదించబోతున్నట్టు సమాచారం. సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం త్రిష..`పొన్నియ‌న్ సెల్వ‌న్` సినిమాలో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న `రామ్‌` అనే చిత్రంలో ఆమె న‌టిస్తుంది. తమిళంలో `గర్జనై`, `సథురంగ వెట్టై 2`, `రాంగి` చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.