హాలీవుడ్ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ త్రోన్స్'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కి అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలలో చాలా మంది ఈ సిరీస్ ని ఫాలో అయ్యేవారు ఉన్నారు. నటి త్రిష కూడా అందులో ఒకరు.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఆఖరి సీజన్ ని ఒక్కో ఎపిసోడ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా సీజన్ 8, మూడో ఎపిసోడ్ విడుదలైంది. ఈ ఎపిసోడ్ చూసిన త్రిష ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో స్టేటస్ పెడుతూ ''పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ ఈసారి ఏడ్చేశా'' అంటూ రాసుకొచ్చింది.

''రమింద్ జవాదీ.. మీ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. మీరు నా ఫేవరెట్. ప్రపంచంలో బెస్ట్ సంగీత దర్శకుడు మీరు. 'గేమ్ ఆఫ్ త్రోన్స్' లేటెస్ట్ ఎపిసోడ్ లో చివరి ఇరవై నిమిషాలు మీరిచ్చిన నేపధ్య సంగీతం నన్ను ఉద్వేగానికి గురి చేసింది, భయపెట్టింది, నవ్వించింది. సాధారణంగా ఇలాంటి సిరీస్ లు చూసి నేను ఇంతగా రియాక్ట్ అవ్వను.. కానీ ఈసారి 
ఏడ్చేశాను'' అని రాసుకొచ్చింది.

ఆర్య స్టార్క్ క్యారెక్టర్ తనకు ఎంతో నచ్చిందని, లియానా మొర్మొంట్, థియోన్ గ్రేజాయ్, సర్ జోరా పాత్రలు ఎండ్ అవుతున్నపుడు ఏడ్చేశానని చెప్పుకొచ్చింది.