సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ఆచార్య(వర్కింగ్ టైటిల్).  చిరు కొరటాల శివ  దర్శకత్వంలో లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ మొదలై దాదాపు నాలుగు నెలలైనా ఈ సినిమాకు కాస్టింగ్,టెక్నీషియన్స్ సమస్యలు మాత్రం తేలటం లేదు. ఓ ప్రక్కన మహేష్ ని ఈ ప్రాజెక్టులోకి తేవటానికి కొరటాల నానా తిప్పలూ పడుతూంటే ఇప్పుడు మరో సమస్య ఆయనకు చుట్టుకుంది. అందుతున్న సమాచారం మేరకు..ఈ సినిమాలో చిరంజీవి సరసన చేయటానికి ఓకే చేసిన త్రిష హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాలో చిరు పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే మొదట ఓకే చేసిన త్రిష ..హఠాత్తుగా సినిమా నుంచి ప్రక్కకు వెళ్లటానికి కారణం ఏమిటీ అంటే మహేష్ ఈ ప్రాజెక్టులో చేయటమే అని తెలుస్తోంది. 
 
ఇంకో వారంలో షూట్ లో జాయిన్ కావాల్సన త్రిష ఇలా హఠాత్తుగా ట్విస్ట్ ఇవ్వటానికి కారణం పరోక్షంగా మహేష్ ని ఈ సినిమాలోకి తీసుకోవటమే అంటున్నారు. మహేష్, త్రిష కాంబినేషన్ లో గతంలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో కనిపించనుండటంతో...అతని ప్రక్కన ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారు. దాంతో చిరంజీవి ప్రక్కన చేస్తున్న తను ఖచ్చితంగా ఆంటీ పరిస్దితి వచ్చేస్తుంది. ఈ విషయం గుర్తించిన త్రిష...తన కెరీర్ కు ఆంటి ఇమేజ్ పెద్ద దెబ్బ కొడుతుందని ప్రక్కకు తప్పుకుందని తెలుస్తోంది. దాంతో ఇప్పుడు త్రిషకు బదులుగా కాజల్ ని ఈ సినిమాకు అడగబోతున్నారట. అయితే ఎవరు హీరోయిన్ గా కన్ఫర్మ్ కాబోతున్నరనే విషయం ఈ నెలాఖరుకు కానీ తెలియదు.
  
ఇక ఈ ఏడాది త్రిష మరో రెండు సినిమాలలో నటిస్తోంది. అందులో మణిరత్నంతో పోన్నియిన్ సెల్వన్ తో ఓ సినిమా, మోహన్ లాల్ తో ఓ సినిమాను. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయశాఖలో పనిచేసే అధికారిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి గోవింద గోవింద, ఆచార్య గోవింద అని టైటిల్ ని పరిశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. దసరా 2020 అంటే ఆగస్టు 14 న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు, ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.