తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 గత ఏడాది విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు.

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 గత ఏడాది విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. మణిరత్నం కలల ప్రాజెక్ట్ ఇది. 

ఏప్రిల్ 28న రెండవ భాగం మరింత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి , శోభిత ధూళిపాళ, త్రిష ఇలా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

తాజాగా కోయంబత్తూర్ లో జరిగిన ప్రమోషన్స్ లో త్రిష, కార్తీ, జయం రవి పాల్గొన్నారు. రెండవ భాగం మొదటి భాగం కంటే ఇంకా బాగా అలరిస్తుందని త్రిష తెలిపింది. ఇక సెకండ్ పార్ట్ లో కార్తీతో నా కెమిస్ట్రీ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. నాకు కార్తీకి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా చాలా బావుంటుంది అని త్రిష అంచనాలు పెంచింది. 

మొదటి భాగంలో ఐశ్వర్య రాయి పాత్రతో ఊహించని విధంగా చిత్రాన్ని ముగించారు. దీనితో ఐశ్వర్యరాయి పాత్ర సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతోంది. . ఆమె కొన్ని చోట్ల వృద్దురాలి లాగా ఎందుకు కనిపిస్తోంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది. ఆలాగే కార్తీ, జయం రవి, విక్రమ్ చేసే పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయి అని కూడా అంతా ఎదురుచూస్తున్నారు.