హిట్ అయిన హిందీ సినిమాలు తెలుగులో రీమేక్ చేయటం కొత్తేం కాదు. అయితే అందుకు తగ్గ స్టార్ కాస్టింగ్ ని ఎంచుకోవటంలోనే దర్శక,నిర్మాతల కష్టం ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఛాలెంజింగ్ జాబ్ నే తమిళ నిర్మాత ధనుంజయ్ తలకెత్తుకున్నారు.  తాప్సీ ప్రధాన పాత్రలో ... గత వారం విడుదలై మంచి రెస్పాన్స్ తో పాటు వసూళ్లను అందుకున్న బద్లా ని సౌత్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

తమిళ,తెలుగు భాషలకు కలిపి ఈ రీమేక్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. హిందీలో తాప్సి పోషించిన పాత్రను తమిళ్ తెలుగులో త్రిషతో చేయించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు తమిళ సినిమా వర్గాల టాక్. గత ఏడాది తుమారి సులు రీమేక్ ని జ్యోతికతో తీసి హిట్ కొట్టిన నిర్మాత ధనుంజయ్ దీన్ని ఇక్కడి రెండు భాషల్లోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట.  అయితే అమితాబ్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

తన బాయ్ ఫ్రెండ్ హత్య కేసులో ఇరుక్కున్న తాప్సిని రక్షించేందుకు వస్తాడు లాయర్ అమితాబ్ బచ్చన్. అక్కడ నుంచి  కథ ఊహించని అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కథ ఇక్కడవాళ్లకు నచ్చే అవకాసం ఉంది . గత ఏడాది తమిళంలో  వచ్చిన 96 బ్లాక్ బస్టర్ సక్సెస్ త్రిష కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది.  దాంతో  తాప్సితో పోలిస్తే త్రిషకే మార్కెట్ పరంగా తమిళ్ తెలుగులో ఎక్కువ ఎడ్జ్ ఉంది. అందుకే ఆమెను తీసుకునే ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం.  ఆల్రెడీ పింక్ రీమేక్ తమిళంలో అజిత్ తో చేస్తున్నారు.