Asianet News TeluguAsianet News Telugu

‘లియో’ ట్రైలర్ డే.. త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్.. స్ట్రాటజీ మాములుగా లేదుగా

‘లియో’ ట్రైలర్ ఈరోజే విడుదల కానుంది. కానీ మేకర్స్ పక్కా టైమ్ ఫిక్స్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ రావడం ఆసక్తికరంగా మారింది.
 

Trisha First Look out from Leo Movie ahead of Trailer Release NSK
Author
First Published Oct 5, 2023, 12:54 PM IST | Last Updated Oct 5, 2023, 12:54 PM IST

తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy)  లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్  ‘లియో’ (Leo). ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  దర్శకత్వంతో తెరకెక్కుతోంది.  ఈ చిత్రంలో ఇదే నెలలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్  ప్రమోషన్స్ ను పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అక్టోబర్ 5 (ఇవ్వాళ)గా కన్ఫమ్ చేశారు. కానీ రిలీజ్ టైమ్ ను ఇంకా ప్రకటించలేదు. దీంతో అభిమానులు, సినీ ప్రియులు ఈ చిత్ర ట్రైలర్ కోసం ఉదయం నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదరుచూస్తున్నారు. 

కానీ చిత్ర యూనిట్ మాత్రం నటీనటుల పోస్టర్లను వదులుతూ వస్తున్నారు. రిలీజ్ టైమ్ ను మాత్రం ప్రకటించడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun)  పోస్టర్స్ ను విడుదల చేశారు. తాజాగా సౌత్ క్వీన్ త్రిష (Trisha)  ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో త్రిషపై రక్తపు మరకలు ఆమెను చంపేందుకు వచ్చిన కత్తిని చూపించారు. త్రిష ఏదో ఆపదలో ఉందని అర్థం అవుతోంది. త్రిష అభిమానులు ఫస్ట్ లుక్ కు ఫిదా అవుతున్నారు. చాలా కాలం తర్వాత మరో బిగ్ ప్రాజెక్ట్ లో తమ అభిమాన హీరోయిన్ కనిపించబోతుండటంతో ఖుషీ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఫ్యాన్స్,, సినీ అభిమానులు Leo Trailer కోసం ఎదురుచూస్తుండగా యూనిట్ మాత్రం ఇలాంటి ట్రైలర్ విడుదల సమయంపై అప్డేట్ ఇవ్వకుండా.. నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ ట్రైలర్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఓపక్క నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపి.. రిలీజ్ టైమ్ ను అనౌన్స్ చేయడంలో ఆలస్యం చేస్తూ ట్రైలర్ పై హైప్ పెంచేస్తున్నారు. ట్రైలర్ కు ముందు సంజు బాయ్, అర్జున్ సర్జా, త్రిషల ఫస్ట్ లుక్ పోస్టర్లను వదులుతూ వారి అభిమానుల అటెన్షన్ నూ ‘లియో’ ట్రైలర్ పై మళ్లీస్తున్నారు. ప్రస్తుతం #LeoTrailerDay ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ఇలా సరికొత్త స్ట్రాటజీతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

కాగా, Leo Trailer కోసం అభిమానులు కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికన లోకేష్ కనగరాజ్, నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోకు వరుసగా ట్వీట్లు పెడుతూనే వచ్చారు. దీంతో అక్టోబర్ 5న అని డేట్ ఫిక్స్ చేశారు. ఈరోజు ట్రైలర్ రాబోతుంటడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్రంలో త్రిష 14 ఏళ్ల తర్వాత విజయ్ సరసన నటిస్తుండటం విశేషం. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios