టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తన హవా సాగించిన నటి త్రిషకి ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో కోలివుడ్ కి చెక్కేసింది. అక్కడ ఛాన్స్ లు రావడంతో మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు.

ఆమె నటించే సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. ఇదివరకే ఒకరిని ఎంగేజ్మెంట్ చేసుకున్న త్రిష పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసేసింది. ఆ తరువాత సినిమాలతో బిజీ అయిపోయింది.

గత కొద్దిరోజులుగా మళ్లీ ఈమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు పెట్టడంతో త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతుందని అంతా అనుకున్నారు. తాజాగా తన పెళ్లి విషయంపై స్పందించింది త్రిష.

'ఓ వ్యాపారవేత్తతో నా వివాహం జరగబోతుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. నా గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వివాహం తరువాత సినిమాలు చేయాలా వద్దా అనేది కూడా ఆ సమయంలో తీసుకునే నిర్ణయమే' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక తెలుగు సినిమాలు చేయరా అనే ప్రశ్నకి సమాధానంగా అవకాశాలు వస్తే తప్పక చేస్తానని కానీ ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం కోలివుడ్ పైనే ఉందని స్పష్టం చేసింది.