`బిల్లా`ని మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయబోతున్నారు అభిమానులు. దీనికితోడు మరో మూడు సర్‌ప్రైజింగ్ ట్రీట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు.
డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే టైమ్ వచ్చింది. రేపు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. దీంతో అభిమానులు చాలా రోజుల నుంచే సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అదే సమయంలో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పాన్ ఇండియా స్టార్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల నుంచి అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `బిల్లా` సినిమాని 4కే రెజల్యూషన్‌తో రేపు విడుదల కాబోతుంది. పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలోనూ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లు కృష్ణంరాజు భాగమైన `ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్`కి విరాళంగా ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ స్టార్ కూతురు, నిర్మాత ప్రసీద ప్రకటించింది. `బిల్లా`ని మరోసారి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయబోతున్నారు అభిమానులు.
దీనికితోడు మరో మూడు సర్‌ప్రైజింగ్ ట్రీట్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్లు ఇవ్వబోతున్నారు. `ఆదిపురుష్` సినిమాకి సంబంధించిన మరో టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. మొదటి టీజర్ విమర్శలెదుర్కొన్న నేపథ్యంలో ఈసారి ఆ విమర్శలకు చెక్ పెడుతూ బెస్ట్ వీడియోని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇంకోవైపు `సలార్` నుంచి గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందట. దర్శకుడు ప్రశాంత్ నీల్ .. డార్లింగ్ అభిమానులకోసం ఓ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసినట్టు టాక్.
అలాగే `ప్రాజెక్ట్ కే` నుంచి కూడా ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఓ అభిమాని దర్శకుడిని ప్రశ్నించగా, రేపు చిన్న సర్‌ప్రైజ్ రాబోతుందని తెలిపారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు దర్శకుడు. మరి ఆ సర్‌ప్రైజ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిది ట్రెండింగ్ అవుతుంది.
