దిల్ రాజు కాంపౌండ్ లోకి ఒకసారి ఎంటర్ అయిన తరువాత ఆయన నచ్చితే వారికి జీతాలిచ్చి మరీ పోషిస్తుంటాడు. ప్రతిభ ఉన్న దర్శకులను తన కాంపౌండ్ నుండి అంత సులువుగా బయటకి పంపడు దిల్ రాజు. అలాంటిది తన బ్యానర్ లో రెండు సినిమాలు చేసిన ఓ డైరెక్టర్, రైటర్ ని బయటకి పంపేసినట్లు తెలుస్తోంది.

'నేను లోకల్' తో దిల్ రాజు బ్యానర్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు త్రినాధరావు నక్కిన, రైటర్ ప్రసన్న ఆ సినిమా తరువాత 'హలో గురు ప్రేమకోసమే' సినిమా తీశారు. ఈ సినిమాకి ఏవరేజ్ మార్కులే పడ్డాయి. అయితే ఈ ఇద్దరూ కూడా తమ తదుపరి చిత్రానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దిల్ రాజు బయట ప్రయత్నించుకోమని చెప్పేశారట.

'హలో గురు ప్రేమకోసమే' సినిమా గనుక హిట్ అయి ఉంటే దిల్ రాజు వీరి అడిగినంత ఇచ్చేవారేమో కానీ ఆ సినిమాకి ఏవరేజ్ టాక్ రావడం, నెక్స్ట్ సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వారిని దిల్ రాజు బయటకి పంపేశారట. ఇప్పుడు ఈ డైరెక్టర్, రైటర్ వెంకటేష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారని టాక్. డబ్బుల విషయంలో సురేష్ బాబుకి దిల్ రాజు కంటే జాగ్రత్త కాస్త ఎక్కువే.. మరి సురేష్ బాబు నుండి భారీ రెమ్యునరేషన్ ఎలా అందుకుంటారో చూడాలి!