కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా 'కెజిఎఫ్ చాప్టర్ 2' రానుంది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వలేదు కానీ అప్పుడే కథకు సంబంధించిన లీకులు చక్కర్లు కొడుతున్నాయి. 

సినిమాలో హీరో రాఖీ భాయ్ కెజిఎఫ్ గనులను తన ఆధీనంలోకి తీసుకొని చనిపోయిన గరుడ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఆ తరువాత శత్రువులంతా ఒక్కటై రాఖీ భాయ్ ని టార్గెట్ చేస్తారట. సినిమా క్లైమాక్స్ లో రాఖీ భాయ్ పాత్రను చంపేస్తారని అంటున్నారు.

ఇలాంటి కథలను అలాంటి ఎండింగే సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. గతంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ట్రాజెడీగానే ముగిశాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని సమాచారం.

అయితే రాఖీ భాయ్ ని శత్రువులు అంతమొందిస్తారా..? లేక ప్రభుత్వ బలగాలా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.