ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్య్రం కోసం పోరాడిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే, ముఖ్యంగా బ్రిటిష్ పాలకులకు హెచ్చరికలు ఇచ్చిన విధానం రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయి. అలాగే ఒక ట్రేడ్ మార్క్  డైలాగ్ కూడా గుర్తురాక మానదు. మెగాస్టార్ సైరా కోసం చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

రీసెంట్ గా సైరా ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో సిస్తూ డైలాగ్ ఈ విధంగా చెప్పారు. 

'ఈ భూమి మీద పుట్టింది మేము - ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాలిరా శిస్తు' అనే డైలాగ్ ను సింపుల్ గా చెప్పేశారు. 

ఇక.. స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన ఆఖరి చిత్రం మేజర్ చంద్రకాంత్. పాటలో వీరపాండ్య కట్ట బ్రాహ్మణగా కనిపించిన విషయం తెలిసిందే. 

అన్నగారు చెప్పిన డైలాగ్ ఇది.. 

నారు పోసావా?

నీరు పెట్టావా?

కోత కొసవా?

కుప్పనూడ్చవా?

ఒరేయ్ తెల్ల కుక్క 

నీకు సిస్తూ ఎందుకు కట్టాలిరా?

అంటూ ఒక యోధుడిగా చెప్పిన ఆ డైలాగ్ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ శిస్తు డైలాగ్ ని మెగాస్టార్ తనదైన శైలిలో సైరా సినిమాలో వినిపించారు. మరి సినిమాకి ఆ డైలాగ్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.