భాగమతి అనంతరం మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్న స్వీట్ గర్ల్  అనుష్క నెక్స్ట్ మరో హారర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్ నిర్మాతగా తెరకెక్కిస్తోన్న ఆ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే యూఎస్ లో షూటింగ్ స్టార్ట్ చేయనుంది. 

ఇకపోతే ప్రస్తుతం సినిమాకు సంబందించిన మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో తెలుగమ్మాయి అంజలి అలాగే అర్జున్ రెడ్డి బేబీ షాలిని పాండే అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఈ సైలెన్స్ మూవీలో మాధవన్ అనుష్కకు జోడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన హారర్ థ్రిల్లర్స్ కంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. 

మార్చ్ ఫస్ట్ వీక్ లోనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి ఇదే ఏడాది సినిమాను విడుదల చేయాలనీ కోన వెంకట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆయనతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడాసైలెన్స్ మూవీకి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.