ప్రముఖ మీడియా ఆర్మాక్స్ ప్రతి నెలా వివిధ చిత్ర పరిశ్రమలపై సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తుంది. జులై నెలకు గానూ టాప్ టెన్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేసింది.  

పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక బాలీవుడ్ ని సౌత్ తొక్కేస్తుంది. అనూహ్యంగా తెలుగు, తమిళ, కన్నడ హీరోలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నారు. సౌత్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. తాజా పాన్ ఇండియా హీరోల సర్వే విడుదల చేయగా టాప్ టెన్ లో నలుగురు టాలీవుడ్ హీరోలు ఉన్నారు. ముగ్గురు తమిళ హీరోలు, ముగ్గురు హిందీ హీరోలకు చోటు దక్కింది. 

అనూహ్యంగా టాప్ 1 పొజీషన్ లో హీరో విజయ్ కొనసాగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న విజయ్ కి ఇండియన్ ఆడియన్స్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చారు. నిజానికి విజయ్ కి ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు అయినా భారీ క్రేజ్ మైంటైన్ చేస్తున్నాడు. విజయ్ తర్వాత రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. మూడో ర్యాంక్ షారుక్ ఖాన్ కి దక్కింది. పఠాన్ విజయంతో ఆయన టాప్ టెన్ లోకి దూసుకు వచ్చాడు. 

Scroll to load tweet…

టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న మరో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్. ఆయనకు నాలుగో ర్యాంక్ దక్కింది. అజిత్ టాప్ ఫైవ్ లో ఉండటం విశేషం. ఆయనకు ఆడియన్స్ ఐదో ర్యాంక్ ఇచ్చారు. గతంలో టాప్ ఫైవ్ లో ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ ర్యాంక్స్ కోల్పోయారు. ఇక ఆరో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఒకప్పుడు ఆయనకు టాప్ 3 దక్కింది. అల్లు అర్జున్ తర్వాత స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఆయనది ఏడో ర్యాంక్. ఇక ఎనిమిదో ర్యాంక్ రామ్ చరణ్ కి దక్కింది. 

తొమ్మిదో ర్యాంక్ అక్షయ్ కుమార్, పదో ర్యాంక్ లో సూర్య కొనసాగుతున్నారు. అయితే ఈ సుర్వ్యే ఫలితాలు ప్రతినెలా మారిపోతూ ఉంటాయి. టాప్ ఉన్న వారు క్రిందకు క్రింద ఉన్నవారు టాప్ పొజీషన్ కి రావచ్చు. కన్నడ స్టార్ యష్ గతంలో టాప్ టెన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు చోటు దక్కలేదు.