దుమ్మురేపుతున్న బిగ్‌బాస్-2: తెలుగు రాష్ట్రాల్లో 60 శాతం వీక్షకులు

Top rating for Bigg boss-s reality show
Highlights

బిగ్‌బాస్ కు అంచనాలను మించిన స్పందన

హైదరాబాద్: బిగ్‌బాగ్ సీజన్-2కు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.  ఈ మేరకు మాటీవి  టిఆర్పీ రేటింగ్ వివరాలను  గురువారం నాడు విడుదల చేసింది.  బిగ్ బాస్ సీజన్ -2  కార్యక్రమం 15.1 రేటింగ్‌తో ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ -1కు యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  సీజన్ -2కు నాని వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో  గత ఏడాది ప్రారంభమైంది. అయితే ఆ సమయంలో కార్యక్రమం ప్రారంభ సమయంలో 16 పాయింట్లతో  టిఆర్పీ రేటింగ్  వచ్చింది.  ఈ దఫాల సీజన్ -2 ప్రారంభంలో 15.1 పాయింట్లు దక్కినట్టుగా మాటీవి ప్రకటించింది.

బిగ్ బాస్-2 సీజన్  ప్రారంభం రోజున ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ కార్యక్రమాన్ని తిలకించారని మాటీవి ప్రకటించింది. మొదటి వారంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 శాతం ఈ రియాల్టీ షో ను చూశారని మాటీవి ప్రకటించింది.

loader