కమల్ హాసన్ - మణిరత్నం సినిమా లాంఛ్.. KH234 కోసం టాప్ టెక్నీషియన్లు.. డిటేయిల్స్

లోకనాయకుడు కమల్ హాసన్ - ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం కాంబోలోని భారీ ప్రాజెక్ట్ ఫార్మల్ లాంచ్ కార్యక్రమం పూర్తైంది. ఈ సందర్భంగా మూవీకోసం పనిచేస్తున్న టెక్నీషియన్ల వివరాలను మేకర్స్  వెల్లడించారు. 
 

Top Crew for KH234 film makers released a video NSK

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) ‘విక్రమ్’తో భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కాస్తా సినిమాలకు గ్యాప్ మళ్లీ పవర్ యాక్షన్ తో దుమ్ములేపారు. ఆ వెంటనే  ప్రముఖ తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తో సినిమాను ప్రకటించారు. వీరి ఇద్దరి కాంబోలో 35 ఏండ్ల తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్ రాబోతుండటం విశేషం. ఇప్పటికే KH234 చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ ఫార్మల్ లాంచ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చెన్నైలో చిత్ర యూనిట్ తో కలిసి సినిమాను ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి సంబంధించి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. సినిమా కోసం పని చేస్తున్న టాప్ టెక్నీషియన్ల వివరాలను వెల్లడించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మించనున్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ KH234కి కెమెరా వర్క్స్ చేస్తున్నారు. ఇక యాక్షన్ కోరియోగ్రఫీని అన్బరీవ్ మాస్టర్స్ అందిస్తున్నారు. ఇప్పటికే వీరు ‘విక్రమ్’ చిత్రంలో కమల్‌తో కలిసి పనిచేశారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శర్మిష్ట రాయ్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఏఖా లఖానీ ఉన్నారు. టాప్ టెక్నీషియన్లు, క్రూ ఉండటం సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది చివర్లో సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారు. 

1987లో కమల్ హాసన్ - మణిరత్నం (Mani Ratnam) కాంబోలో తమిళంలో ‘నాయకన్’ వచ్చి భారీ సక్సెస్ ను అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇంకా ఈ చిత్రంలో నటీనటుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఇక త్వరలోనే యూనిట్ సెట్స్ లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్2’లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాలతో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios