అర్జున్ విషయంలో ఓపెన్ అయిన విశ్వక్ సేన్, గొడవ అందుకే జరిగిందట...?
సీనియర్ హీరో అర్జున్ తో గొడవ గురించి స్పందించారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. అసలు స్టార్ హీరోతో గొడవ ఎందరకు అయ్యిందో ఓపెన్ గా చెప్పేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..?
టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరోవిశ్వక్ సేన్. హిట్లు కొడుతూ.. తనకంటూ ఓ స్పెషల్ మార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాగా ఆయన ఎంత స్టార్ డమ్ సాధిస్తూ వెళ్తున్నాడో.. అంతా వివాదాలు కూడా వెనకేసుకుంటున్నాడు. వివాదాల్లో ఎక్కువగా నానుతున్న విశ్వక్.. తగ్గేదే లే అంటూ కామెంట్లు కూడా చేస్తున్నాడు. టీవి9 గొడవతో పాటు.. స్టార్ హీరో అర్జున్ తో కూడా విశ్వక్ సేన్ కు వివాదం ఉంది. ఇక తాజాగా ఆ వివాదానికి సబంధించి క్లారిటీ కూడా ఇచ్చాడు విశ్వక్.
గతంలో విష్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ సినిమా ద్వారా ఆయన తన కూతురు ఐశ్వర్యను తెలుగు తెరకి పరిచయం చేయాలనుకున్నారు. అయితే ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టిన అర్జున్, విష్వక్ కమిట్ మెంట్ లేని నటుడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. షూటింగ్ లో ఏమాత్రం సహకరించలేదని విమర్శలు గుప్పించారు. దాంతో ఆ వివాదం అప్పట్లో హైలెట్ అయ్యింది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్వక్ సేన్ కి ఈ అంశానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. అసలు అక్కడ గొడవేమి లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి కదా.. నేను ఒక రోజు షూటింగ్ ఆపమని చెప్పానంతే. అంతే తప్ప సినిమాను క్యాన్సిల్ చేయండి అని నేను అడగలేదు. నాకు సినిమా నేపథ్యం లేకపోవడం వలన, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అయినా నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు" అన్నాడు. అంతే కాదు అసలు ఈ విషయంపై నేను ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు అన్నారు విశ్వక్ సేన్.
దానికి ఓ కారణం ఉంది అన్నారు ఆయన.. ఎందుకంటే నేను సినిమా కోసం తీసుకున్నదానికంటే కూడా రెట్టింపు వారికి వెనక్కి ఇచ్చేశాను. ఆయన కోపంతో తీసుకున్న నిర్ణయం వలన, ఎక్కువగా నష్టపోయింది నేనే" అని విష్వక్ సేన్ అన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈమూవీ మార్చ్ 8న రిలీజ్ కాబోతోంది. ఇక ఈమూవీతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న గామి కూడా రిలీజ్ కు ముస్తాబవుతుంది.