Asianet News TeluguAsianet News Telugu

ఆంజనేయ మాలలో యంగ్ హీరో.. వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ ఫోటోస్

యంగ్ హీరో విశ్వక్ సేన్ సరికొత్తగా కనిపించారు. మాస్  హీరోగా.. కాంట్రవర్షియల్ స్టార్ గా పేరున్న విశ్వక్.. భక్తి మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు. 

Tollywood Young Hero Vishwak Sen Anjaneya Swamy Mala JmS
Author
First Published Sep 25, 2023, 2:38 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ సరికొత్తగా కనిపించారు. మాస్  హీరోగా.. కాంట్రవర్షియల్ స్టార్ గా పేరున్న విశ్వక్.. భక్తి మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు. 

టాలీవుడ్ యంగ్ హీరో  విశ్వక్ సేన్ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. వరుస సినిమాలు తెరకెక్కిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. డిఫరెంట్  ఇమేజ్ ను సాధించాడు.  ఓ పక్క వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ రీసెంట్ గా  హోస్ట్ అవతారం ఎత్తాడు.  ఆహా  ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షోని కూడా మొదలుపెట్టాడు. 

ఇక త్వరలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో  ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఈమూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈమూవీ ప్రమోషన్స్ లో  బిజీగా ఉన్నారు టీమ్. ఇక తాజాగా విశ్వక్ సేన్ కు సబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్.. భక్తి మార్కంలోకి వచ్చాడు. ఆయన ఈసారి ఏకంగా ఆంజనేయ మాలలో కనిపించారు. 

ఆహా ఫ్యామిలీ ధమాకా షో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొనగా ఆంజనేయ స్వామి మాల దుస్తుల్లో కనిపించారు. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా తన ఫోటోని పోస్ట్ చేసి జై భజరంగ్ బలి అని రాశారు విశ్వక్. దీంతో ఆంజనేయ స్వామి మాలలో ఉన్న విశ్వక్ సేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడు ఫైర్ గా ఉండే విశ్వక్ లో.. భక్తి కోణం కూడా ఉందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే విశ్వక్ తన సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్లలో భాగంగా కొన్నిసార్లు చేసే ప్రాంక్ వీడియోలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పాలి.ఇలా ఇదివరకు ఇలాంటి ప్రాంక్ వీడియోలు ద్వారా ఈయన వివాదాలలో చిక్కుకున్నారు.ఇలా నిత్యం వివాదాలలో ఉండే ఈయన ఒక్కసారిగా భక్తి భావంలో మునికి తేలుతూ కనిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios