యంగ్ స్టార్ నితిన్ తగ్గేది లేదంటున్నారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో కామ్ అయిపోయిన నితిన్.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు. 

యంగ్ స్టార్ నితిన్ తగ్గేది లేదంటున్నారు. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో కామ్ అయిపోయిన నితిన్.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు. 

నితిన్ భీష్మ హిట్.. తరువాత మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టాయి. హ్యాట్రిక్ హిట్ వస్తుందేమో అనుకుంటే హ్యాట్రిక్ ఫెయిల్యూర్ చూశాడు. ఈ ఫెయిల్యూర్స్ నితిన్ లో పట్టుదలను పెంచాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. తన సొంత బ్యానర్ లో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా చేస్తున్నాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 

 ఇక ఈ సినిమా నుంచి నితిన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో నితిన్ కనిపిస్తున్నాడు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ క్యారెక్టర్ లో నితిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంల ఈ పోస్టర్ చూడగానే అర్థమైపోతుంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే కుటిల రాజకీయాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అవినీతి రాజకీయాలకు అడ్డుకట్టవేసే యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. 

మహతి స్వరసాగర్ సంగీతాన్నిఅందిస్తున్న ఈ సినిమాలో, నితిన్ సరసన కృతి శెట్టి – కేథరిన్ లుహీరోయిన్లు గా అలరించనున్నారు. అయితే కరోనా వల్ల షూటింగ్ షెడ్యూల్స్ డిలై అవుతూ వచ్చాయి. లేకుంటే లాస్ట్ ఇయర్ లోనే ఈసినిమా రిలీజ్ అయిపోయేది. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మేకర్స్.